OPPO A 33 (2020) స్మార్ట్ ఫోన్ 90Hz పంచ్ హోల్ తో బడ్జెట్ ధరలో వచ్చింది

Updated on 22-Oct-2020
HIGHLIGHTS

ఒప్పో ఎ 33 (2020) స్మార్ట్ ఫోన్ ను తన A -సిరీస్ లైనప్‌లో భాగంగా బడ్జెట్ ధరలో ఇండియాలో లాంచ్ చేసింది.

ఈ వారం ప్రారంభంలో ఎఫ్ 17 ప్రో యొక్క దీపావళి ప్రత్యేక ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించింది.

ఒప్పో A33 (2020) స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది.

ఒప్పో ఎ 33 (2020) స్మార్ట్ ఫోన్ ను తన A -సిరీస్ లైనప్‌లో భాగంగా బడ్జెట్ ధరలో ఇండియాలో లాంచ్ చేసింది. A33 ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన A31 ను అనుసరిస్తుంది మరియు అధిక-రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే కొత్త ఫోన్లను విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తోంది మరియు ఇది ఈ వారం ప్రారంభంలో ఎఫ్ 17 ప్రో యొక్క దీపావళి ప్రత్యేక ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించింది.

ఒప్పో A33 (2020) ధర మరియు లభ్యత

ఒప్పో ఎ 33 (2020) ధర రూ .11,990 మరియు 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ రెండవ దశలో ఈ నెల చివరిలో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది. ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా A33 ను అందుబాటులోకి తెస్తామని ఒప్పో హామీ ఇచ్చింది.

ఒప్పో A33 (2020) స్పెషిఫికేషన్స్

ఒప్పో A33  స్మార్ట్ ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో నిర్మించబడింది. ఇది 8.4 మిల్లీమీటర్ల మందం మరియు 186 గ్రాముల బరువు ఉంటుంది. ఇది రెండు రంగులలో అందించబడుతుంది – మింట్ క్రీమ్ మరియు మూన్లైట్ బ్లాక్. ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్ ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది.

ఒప్పో A33 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. అధనంగా, 256 జిబి వరకు స్టోరేజ్ ఉన్న మైక్రో ఎస్‌డి కార్డ్‌ను ఉపయోగించి స్టోరేజ్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన Color OS 7.2 పై నడుస్తుంది.

ఒప్పో A33 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో,  f / 2.2 ఎపర్చరు గల ప్రాధమిక 13MP కెమెరా, జతగా 2MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ వున్నాయి. వెనుక కెమెరాలు 1080p పిక్సెల్ రిజల్యూషన్ లో 30FPS వద్ద రికార్డ్ చేయగలవు మరియు 6x డిజిటల్ జూమ్ వరకు అందిస్తుంది. ముందు భాగంలో, పంచ్-హోల్ కటౌట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

A33 లో స్టీరియో స్పీకర్ సిస్టమ్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. ఇది 5,000WAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో బాక్స్ లోనే ఛార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :