Oneplus తన స్మార్ట్ ఫోన్ను Rs.15,000 రూపాయల విభాగంలో కూడా తెస్తోందా?

HIGHLIGHTS

ఇటీవల ప్రకటించిన Oneplus NORD తో మిడ్ రేంజ్ ధర విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.

ఒక కొత్త వన్ ప్లస్ డివైజ్ యొక్క వివరాలను చూస్తుంటే మాత్రం వన్ ప్లస్ సంస్థ Rs.15,000 రూపాయల విభాగంలో కూడా అడుగు పెట్టబోతోందనే అనుమానం కలుగుతోంది.

Oneplus Clover పేరుతొ గీక్ బెంచ్ లో కనిపించిన ఈ ఫోన్ Snapdragon 660 SoC తో కనిపించింది

ఇప్పటి వరకూ Oneplus బ్రాండ్ అంటే ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా మాత్రమే అందరికీ పరిచయముంది. అయితే, ఇటీవల ప్రకటించిన Oneplus NORD తో మిడ్ రేంజ్ ధర విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. అయితే, ఆశ్చర్యకరంగా ప్రస్తుతం గీక్ బెంచ్ లో కనిపించిన ఒక కొత్త వన్ ప్లస్ డివైజ్ యొక్క వివరాలను చూస్తుంటే మాత్రం వన్ ప్లస్ సంస్థ Rs.15,000 రూపాయల విభాగంలో కూడా అడుగు పెట్టబోతోందనే అనుమానం కలుగుతోంది.

ఎందుకంటే, Oneplus Clover పేరుతొ గీక్ బెంచ్ లో కనిపించిన ఈ ఫోన్ Snapdragon 660 SoC తో కనిపించింది. మనకు తెలుసు ఈ ప్రాసెసర్ బడ్జెట్ ధరలో లభిస్తుంది మరియు ఇప్పటి వరకూ ఈ ప్రాసెసర్ తో  వచ్చిన దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా కేవలం రూ. 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో విడుదల చేయబడ్డాయి.

ఇక ఈ ఫోన్ గురించి Geekbench లో కనిపించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఫోన్ యొక్క అప్డేట్ ఆగష్టు 5 వ తేదీకి ఇచ్చినట్లు చూపిస్తోంది. ఈ ఫోన్ 1.84 GHz బేస్ ఫ్రీక్వెన్సీ గల Snapdragon 660 SoC తో తీసుకొస్తున్నట్లు మరియు Oneplus Clover కోడ్ నేమ్ తో చూపిస్తోంది. ఇది 4 GB తో ఉన్నట్లు కూడా ఇందులో చూపించింది. అలాగే, ప్రస్తుత ప్రధాన ఆండ్రాయిడ్ పేపరేటింగ్ సిస్టం అయినటువంటి Android 10 పైన నడుస్తుంది.

కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ Oneplus Clover యొక్క స్కోర్స్ కూడా వివరించింది. ఇందులో సింగల్-కోర్ స్కోర్ నుండి 336 పాయింట్లను, సింగల్-కోర్ స్కోర్ నుండి 1495 పాయింట్లను సాధించింది. కాబట్టి, పైన పేర్కొన్న అన్ని వివరాలను ఆధారంగా చేసుకొని చూసినట్లయితే, ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, వన్ ప్లస్ నుండి ఇటీవల వచ్చిన Oneplus NORD కంటే కూడా చాలా చవకైన స్మార్ట్ ఫోనుగా అవతరించవచ్చు.

కవర్ ఫోటో : వన్ ప్లస్ నార్డ్

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :