వన్‌ప్లస్ 9 సిరీస్ ఫస్ట్ అఫీషియల్ లుక్ అదిరింది

Updated on 10-Mar-2021
HIGHLIGHTS

వన్‌ప్లస్ 9 అధికారిక ఇమేజ్ విడుదల

Hasselblad తో ఈ ఫోన్లలోని కెమెరా సిస్టమ్ లను డెవలప్(తయారీ) చేయిస్తోంది

9 సిరీస్ ఫోన్ల పైన వన్‌ప్లస్ మరింత ద్రుష్టిపెట్టినట్లు స్పష్టం

వన్‌ప్లస్ 9 సిరీస్ గురించి ఇప్పటి వరకూ రూమర్లు లీక్స్ మాత్రమే వచ్చాయి. అయితే, మార్చి 23 న ఇండియాలో విడుదల కోసం కంపెనీ డేట్ సెట్ చేసింది. ఇప్పుడు దీనికి సంభందించి మొదటిసారిగా అధికారిక ఇమేజ్ ని విడుదల చేసింది. వన్‌ప్లస్ రిలీజ్ చేసిన ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఎంత స్టైల్ డిజైన్ మరియు కెమెరాల పరంగా ఎంత గొప్పగా ఉండనున్నది అన్న విషయం అర్ధమవుతుంది.

వాస్తవానికి, వన్‌ప్లస్ ఈ 9 సిరీస్ నుండి వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, 9లైట్ మూడు ఫోన్లను లాంచ్ చేయవచ్చని అంచనావేస్తున్నారు. అయితే, వన్‌ప్లస్ ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ Hasselblad తో ఈ ఫోన్లలోని కెమెరా సిస్టమ్ లను డెవలప్(తయారీ) చేయిస్తోంది. అంటే, వన్‌ప్లస్ ఈ 9 సిరీస్ యొక్క ఫోన్ల పైన వన్‌ప్లస్ మరింత ద్రుష్టిపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే వచ్చిన లీక్స్ ద్వారా వన్‌ప్లస్ 9 ప్రో 48MP మరియు 64MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి జతగా మంచి ఆప్టికల్ జూమ్ అందించగల టెలీఫోటో కెమెరాని కూడా కలిగి వుంటుందని చెప్పబడింది. అయితే,  వన్‌ప్లస్ 9 యొక్క అధికారిక టీజింగ్ లో లో మాత్రం SonyIMX766 సెన్సార్ తో అల్ట్రా వైడ్ మరియు అల్ట్రా క్లియర్ కెమెరా గురించి చెబుతోంది. అంటే, ఈ ఫోన్ సోనీ యొక్క 50ఎంపీ కెమెరాతో ఉంటుందని సూచింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :