OnePlus 10 Pro ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వన్ ప్లస్

HIGHLIGHTS

OnePlus 10 Pro ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది

వన్ ప్లస్ CEO పీట్ లావ్ వన్‌ప్లస్ ఫోరమ్‌లలోని బ్లాగ్ పోస్ట్‌లో విడిగా డిజైన్‌ను వివరించాడు

కెమెరా మాడ్యూల్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా వుంది

OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ జనవరి 11 న చైనాలో విడుదల చేయడానికి వన్ ప్లస్ రెడీ అయ్యింది. లాంచ్ కోసం అందిస్తున్న టీజర్ లతో పాటుగా నిన్న ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది. వన్ ప్లస్ CEO పీట్ లావ్ వన్‌ప్లస్ ఫోరమ్‌లలోని బ్లాగ్ పోస్ట్‌లో విడిగా డిజైన్‌ను వివరించాడు. జనవరి 11 న చైనాలో వన్ ప్లస్ 10 సిరీస్ నుండి వన్ ప్లస్ 10 మరియు వన్ ప్లస్ 10 ప్రో లను విడుదల చేస్తుంది. తరువాత, కొన్ని నెలల తరువాత గ్లోబల్ లాంచ్ జరగనుంది.

OnePlus 10 Pro:

వన్ ప్లస్ 10 ప్రో డిజైన్ ఇట్టే ఆకర్షించే విధంగా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ గురించి వెల్లడించిన విధంగా, ఈ ఫోన్ వోల్కానిక్ బ్లాక్ మరియు ఫారెస్ట్ ఎమరాల్డ్ రెండు కలర్స్ లో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్‌లో హైలైట్ చేసే ప్రధాన భాగం మిర్రర్డ్ సిరామిక్‌తో తయారు చేయబడిన కెమెరా బంప్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా వుంది. అంతేకాదు, సిరామిక్ అనేది చాలా ప్రీమియం మెటీరియల్‌గా నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుంది మరియు గాజు కంటే 13 రేట్లు ధృడమైనది కాబట్టి ఎక్కువ దీర్ఘకాలం మన్నిక నిస్తుందని కంపెనీ తెలిపింది.

OnePlus 10 Pro: లీక్డ్ స్పెక్స్

OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్, అంటే 3216×1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ను అందించడమే కాక 120Hz రిఫ్రెష్ రేట్ కు కూడా మద్దతునిస్తుంది.

వన్ ప్లస్ 10 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు చెప్పబడు తోంది. ఇందులో OIS మరియు లేజర్ ఆటోఫోకస్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 3X Zoom తో కూడిన 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. OnePlus 10 Pro పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది.              

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :