OnePlus Pad Go 2: బిగ్ డాల్బీ విజన్ డిస్ప్లే మరియు 5G సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 09-Dec-2025
HIGHLIGHTS

OnePlus Pad Go 2 అప్ కమింగ్ ప్యాడ్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ

డిజైన్, డిస్ప్లే మరియు మరిన్ని కీలక వివరాలు ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది

డిసెంబర్ 17న వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ఇండియాలో లాంచ్ అవుతుంది

OnePlus Pad Go 2 : వన్ ప్లస్ అప్ కమింగ్ ప్యాడ్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ ప్యాడ్ కీలక ఫీచర్లు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ డిజైన్, డిస్ప్లే మరియు మరిన్ని కీలక వివరాలు ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ప్యాడ్ వివరాలు అందించింది. మరి ఈ అప్ కమింగ్ ప్యాడ్ గురించి ఇప్పటికే కంపెనీ అందించిన టీజర్ ఫీచర్ వివరాలు ఏమిటో చూద్దామా.

OnePlus Pad Go 2 : ప్యాడ్ లాంచ్ డేట్

డిసెంబర్ 17న వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ఇండియాలో లాంచ్ అవుతుంది. అదే రోజు వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవుతుంది. ఈ ప్యాడ్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ అప్ కమింగ్ ప్యాడ్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి టీజింగ్ చేస్తోంది.

OnePlus Pad Go 2 : కీలక ఫీచర్స్

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 కీలక ఫీచర్స్ ని కంపెనీ బయటకు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ 5G చిప్ సెట్ తో 5జి కనెక్టివిటీ ప్యాడ్ గా లాంచ్ అవుతుంది. ఇది చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది మరియు చాలా సన్నని డిజైన్ లో కూడా చాలా పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ లో 10,050 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ప్యాడ్ ను వేగంగా ఛార్జ్ చేసే 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 6.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో అందించింది. అంటే, స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ప్యాడ్ లాంచ్ అవుతుంది.

ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ప్యాడ్ లో గొప్ప డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ టీజింగ్ ద్వారా తెలియజేసింది. ఇందులో, 900 నిట్స్ HBM బ్రైట్నెస్ మరియు (2800 x 1980) రిజల్యూషన్ కలిగిన ప్రీమియం ప్రీమియం డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 4096 లెవెల్స్ ఆఫ్ ప్రెజర్ కలిగిన స్టైలో పెన్ తో వస్తుంది. ఈ ప్యాడ్ AI సూట్ కలిగి ఉంటుంది మరియు ఇందులో AI రైటర్, AI ట్రాన్స్లేషన్, AI సమరీ వంటి ఫీచర్స్ ఉంటాయి.

Also Read: డెడ్ లైన్ లోపుగా PAN – Aadhaar Link తప్పనిసరి.. లేదంటే పాన్ కార్డు చెల్లదు.!

ఇందులో వెనుక సింగల్ కెమెరా ఉంటుంది. ఈ ప్యాడ్ 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ బిగ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ప్యాడ్ మంచి వర్క్ ఫ్లో అందించే గొప్ప సపోర్ట్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ప్యాడ్ అప్డేట్ ఫీచర్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :