అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి OnePlus Nord 5G సేల్

HIGHLIGHTS

కేవలం మిడ్ రేంజ్ ధరలో 5G సపోర్ట్ తో తీసుకొచ్చినటువంటి OnePlus Nord 5G స్మార్ట్ ఫోన్ యొక్క సేల్

Oneplus NORD ఫోన్‌ Qualcomm Snapdragon 765 G 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు Adreno 620 GPU తో కలిగి ఉంటుంది.

ఇటీవల, కేవలం మిడ్ రేంజ్ ధరలో 5G సపోర్ట్ తో   తీసుకొచ్చినటువంటి OnePlus Nord 5G స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు ప్రకటించిన అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మొదలయ్యింది. ఈ OnePlus Nord 5G స్మార్ట్ ఫోన్ తమ సొంతం చేసుకోవాలని చుస్తున్నవారు ఈరోజు అమేజాన్ నుండి కొనవచ్చు. ఈ ఫోన్, కెమేరా, పెరఫార్మెన్స్ , మరియు డిస్ప్లే పరంగా గొప్పగా వుంటుంది. 

Oneplus NORD Price

Oneplus NORD యొక్క 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999 రుపాయల ధరతో, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.29,999 రుపాయల ధరతో కొనవచ్చు.  

Oneplus NORD ప్రత్యేకతలు

Oneplus NORD ఒక 6.44-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగివుంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ ఫోన్  పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లే తో వస్తుంది మరియు ఇందులో మీకు డ్యూయల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

ఈ ఫోన్‌ను Qualcomm Snapdragon 765 G 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు Adreno 620 GPU తో కలిగి ఉంటుంది. ఇది 8 జిబి/12 జిబి ర్యామ్ మరియు 128 జిబి/256 జిబి స్టోరేజ్ ‌తో జత చేయబడింది.

Oneplus NORD వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ‌తో వుంటుంది, ఇందులో ప్రాధమిక 48 MP కెమెరా, 8 MP  అల్ట్రా-వైడ్-కెమెరా మరియు 5MP సెన్సార్ కి జతగా 2 MP మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీలు కోసం 16 MP కెమెరా ఉంది.

ఇది అవుట్-ఆఫ్-ది-బాక్స్ వ్రాప్ ఛార్జ్ 30T  ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :