వినూత్నమైన AR Launch ఈవెంట్ ద్వారా OnePlus Nord విడుదల : వరల్డ్ లో ఇదే ఫస్ట్

Updated on 10-Jul-2020
HIGHLIGHTS

వన్‌ప్లస్ నుండి రాబోయే సరసమైన స్మార్ట్‌ ఫోన్ గురించి చాలా వివరాలను తెలియజేస్తుంది.

OnePlus Nord స్మార్ట్ ఫోన్ ను సరికొత్త స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ చిప్సెట్ మరియు 5G సపోర్టుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

ఇటువంటి ఒక సాంకేతికతతో ఒక స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడం వరల్డ్ లో ఇదే ఫస్ట్.

నిన్ననే వన్‌ ప్లస్ నార్డ్ డిజైన్ నమూనా చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటోలో, వన్‌ప్లస్ నుండి రాబోయే సరసమైన స్మార్ట్‌ ఫోన్ గురించి చాలా వివరాలను తెలియజేస్తుంది. అయితే, ఈరోజు అమేజాన్ ఇండియా ద్వారా చేస్తున్న టీజింగ్ చూస్తుంటే, వీటిలో చాలా వరకూ నిజమనే అనిపిస్తుంది. అంతేకాదు,  వినూత్నమైన AR Launch ఈవెంట్ ద్వారా OnePlus Nord విడుదల చేయనునట్లు కూడా  ప్రకటించింది. ఇటువంటి ఒక సాంకేతికతతో ఒక స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడం వరల్డ్ లో ఇదే ఫస్ట్.       

అమేజాన్ టీజింగ్ పరిశీలిస్తే, OnePlus Nord స్మార్ట్ ఫోన్ ను సరికొత్త స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ చిప్సెట్ మరియు 5G సపోర్టుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విట్టర్ ద్వారా చేసిన టీజింగ్ ట్వీట్ చూసినట్లయితే, ఈ వన్‌ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ AMOLED డిస్ప్లేతో తీసుకురానునట్లు చెబుతోంది.           

ఇక లీకైన, ఈ చిత్రాలు ఫోన్ ముందు-ఎడమ మూలలో డ్యూయల్-పంచ్ హోల్ కటౌట్ను కలిగి ఉన్నాయని మరియు నాలుగు కెమెరాలు వెనుకవైపు నిలువుగా అమర్చబడి , ఒక LED ఫ్లాష్ సహాయంతో ఉన్నాయని తెలుస్తుంది. లీకైన చిత్రాలలో, ఈ ఫోన్‌లో పారదర్శక కేసు ఉంది, అందుకే వెనుక ప్యానెల్ యొక్క ఊహించడం కొంచెం కష్టం.

ఇక మరొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే, వన్‌ ప్లస్ తన సరసమైన స్మార్ట్‌ ఫోన్ వన్‌ ప్లస్ నార్డ్ ‌ను ప్రారంభించడం కోసం ప్రపంచంలో మొదటి AR ఈవెంట్‌ను హోస్ట్ చేస్తోంది మరియు ఈ లైవ్ స్ట్రీమ్ చూడడానికి మీకు కావాల్సిన AR App ని ఇప్పటికే  Play Store మరియు యాప్ స్టోర్‌లో ప్రారంభించింది. వన్ ప్లస్ నార్డ్ లాంచ్ ఈవెంట్ జూలై 21 న జరగనుండగా, అమెజాన్ ఇండియాలో జూలై 15 నుండి ప్రీ-ఆర్డర్స్ మొదలుపెట్టనుంది.

వన్‌ ప్లస్ నార్డ్ Leaked స్పెసిఫికేషన్స్

వన్ ‌ప్లస్ నార్డ్ 6.55-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగి ఉందని రూమర్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఫోన్‌లో మూలలో డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ ఉండవచ్చని ఈ లీక్స్ సూచించాయి.

ఈ ఫోన్‌ను క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 620 జిపియుతో కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడింది మరియు మరిన్ని వేరియంట్‌లు కూడా ఉండవచ్చు.

వన్‌ ప్లస్ నార్డ్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు, ఇందులో ప్రాధమిక 64 ఎంపి కెమెరా, 16 ఎంపి అల్ట్రా-వైడ్-కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, సెల్ఫీలు కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మద్దతు ఉన్న 32MP ప్రాధమిక కెమెరా ఉంది.

ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌కు మద్దతుతో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడిందనే రూమర్ కూడా ఉంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :