OnePlus Nord CE5 launching with premium features in india
OnePlus Nord CE5 స్మార్ట్ ఫోన్ వచ్చేవారం ఇండియన్ మర్కెట్లో లాంచ్ అవుతుంది. ఇదే సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ లో ఈ ఫోన్ మిడ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా వస్తుంది. గత జనరేషన్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 తో పోలిస్తే, ఈ కొత్త జెనరేషన్ స్మార్ట్ ఫోన్ చాలా గొప్ప అప్డేట్స్ అందుకున్నట్లు తడుముకోకుండా చెప్పొచ్చు.
వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్ జూలై 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్స్ కూడా వన్ ప్లస్ ముందుగా ప్రకటించింది. ఈ ఫోన్ జూలై 12వ తేదీ ఉదయం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. కాబట్టి, ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది.
వన్ ప్లస్ నార్డ్ CE5 మంచి ఆకర్షణీయమైన స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఇది 1.42 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే 5జి చిప్ సెట్ గొప్ప గేమింగ్ పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ గా చెప్పబడుతుంది.
ఈ ఫోన్ లో గేమింగ్ కోసం తగిన డిస్ప్లే ఉన్నట్లు కూడా వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ గరిష్టంగా 120FPS వరుకు BGMI మరియు CODM గేమింగ్ ఫ్రేమ్ రేట్ కి సపోర్ట్ చేస్తుందిని వన్ ప్లస్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ అందమైన పెద్ద బంప్ లో కలిగి ఉంటుంది. ఇందులో OIS మరియు 4K 60FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది గొప్ప వీడియో అవుట్ పుట్ మరియు సహజమైన రంగులు కలిగిన ఫోటోలు అందిస్తుందని వన్ ప్లస్ పేర్కొంది.
Also Read: Dolby Audio Soundbar: 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వివరాలు కూడా వన్ ప్లస్ టీజర్ ద్వారా బయట పెట్టింది. వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్ లో 7100 mAh భారీ బ్యాటరీ సెటప్ ఉందని వన్ ప్లస్ తెలిపింది. ఈ ఫోన్ కూడా వన్ ప్లస్ ఎఐ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలో తెలిసే అవకాశం వుంది.