OnePlus Nord CE 5G: విడుదలకు ముందే లీకైన ధర

Updated on 08-Jun-2021
HIGHLIGHTS

విడుదలకు ముందే OnePlus Nord CE 5G ప్రైస్ లీక్

OnePlus TV U1S ప్రైస్ కూడా లీక్ అయ్యింది

గొప్ప ఫీచర్లు తక్కువ ధరతో రావచ్చు

OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో విడుదల అవుతుందనగా నెట్టింట్లో ఈ ఫోన్ ప్రైస్ లీకైయ్యింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ముందే తెలిసిపోయింది. ఇప్పటికే వన్ ప్లస్ ఈ ఫోన్ యొక్క స్పెక్స్ ను వన్ ప్లస్ రివీల్ చెయ్యగా మరికొన్ని స్పెక్స్ ఆన్లైన్ లీక్స్ ద్వారా వెల్లడయ్యాయి.

ప్రముఖ భారతీయ టిప్ స్టార్ ఇషాన్ అగర్వాల్ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 5G ధర గురించి లీక్ అందించారు.   OnePlus Nord CE 5G ఇండియాలో రూ.22,999 ధరతో లాంచ్ అవుతుందని తన ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. అంతేకాదు, అప్ కమింగ్ OnePlus టీవీ OnePlus TV U1S ధర వివరాలను కూడా ఈ ట్వీట్ లో వెల్లడించారు. అయితే, అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా ఇంకా వన్ ప్లస్ ప్రకటించ లేదు.

OnePlus Nord CE 5G: ఎటువంటి స్పెక్స్ తో వస్తుందని అంచనా

OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ గురించి వన్ ప్లస్ చేస్తున్న టీజింగ్ మరియు స్పెక్స్ రివీల్ కార్యక్రమం నుండి ఈ ఫోన్ యొక్క కొన్ని కీ స్పెక్స్ ఇప్పటికే బయటకి వచ్చాయి. ఈ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ AMOLED డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ రోజు రివీల్ చేసిన కొత్త వివరాల ప్రకారం OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ 65W అల్ట్రా ఫాస్ట్ వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా సన్నగా కేవలం 7.9mm మందం తో మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఇచ్చినట్లు వన్ ప్లస్ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :