OnePlus Nord CE 5G: షాకింగ్ ధరతో వచ్చిన వన్ ప్లస్ 5G ఫోన్

Updated on 11-Jun-2021
HIGHLIGHTS

OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో షాకింగ్ ధరతో లాంచ్

Fluid AMOLED డిస్ప్లే, వేగవంతమైన క్వాల్కమ్ 5G ప్రాసెసర్

లేటెస్ట్ మరియు బెస్ట్ స్పెక్స్ తో వచ్చింది

OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో షాకింగ్ ధరతో లాంచ్ అయ్యింది. గత నెల రోజులుగా వన్ ప్లస్ చేస్తున్న టీజింగ్ కి తెరపడింది. OnePlus Nord CE 5G ఇప్పుడు అధికారికంగా విడుదలయ్యింది. ఈ ఫోన్ భారీ ఫీచర్లతో వచ్చిన కూడా ధర మాత్రం బడ్జెట్ లోనే వుంచింది. అంతేకాదు, పెద్ద కెమెరాతో తక్కువ ధరలో వచ్చిన మొదటి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. కేవలం ఇదొక్కటే కాదు Fluid AMOLED డిస్ప్లే, వేగవంతమైన క్వాల్కమ్ 5G ప్రాసెసర్ వంటి చాలా లేటెస్ట్ మరియు బెస్ట్ స్పెక్స్ తో వచ్చింది.

OnePlus Nord CE 5G: ధర

OnePlus Nord CE 5G :  (6GB + 128GB) – రూ.22,999      

OnePlus Nord CE 5G :  (8GB + 128GB) – రూ.24,999

OnePlus Nord CE 5G :  (12GB + 2565GB) – రూ.27,999

OnePlus Nord CE 5G : స్పెషిఫికేషన్స్

ఈ వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ Fluid AMOLED డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని అందించవచ్చు. అంతేకాదు, ఈ డిస్ప్లే లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఇచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నామ్ప్ డ్రాగన్ 750G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు Adreno 619 GPU తో ఉంటుంది. దీనికి జతగా  గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వస్తుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మోనో లెన్స్ ని కలిగి వుంటుంది. ఈ కెమెరా PDAF మరియు CAF వంటి మల్టి ఆటో ఫోకస్ లకు సపోర్టుబ్ చేస్తుంది. ముందుభాగంలో, EIS సపోర్ట్ కలిగిన 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :