ఇండియాలో వన్‌ప్లస్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 2T 5G. వన్‌ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ నార్డ్ 2 5జి యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా తీసుకువచ్చింది. అయినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను మాత్రం ఇండియన్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అందించింది. మరి వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ ఫోన్ నార్డ్ 2 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు చూద్దామా.
వన్‌ప్లస్ నార్డ్ 2టి 5G యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 126GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.28,999. రెండవ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.33,999. వన్‌ప్లస్ నార్డ్ 2T 5G జేడ్ ఫాగ్ మరియు గ్రే షాడో రెండు కలర్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ జూలై 5 మధ్యాహ్నం 12 గంటలకు నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ పైన ICICI బ్యాంకు కార్డ్స్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్ అఫర్ ను అందించింది మరియు ఇతర అనేక ఆఫర్లను కూడా జత చేసింది.
ఈ వన్‌ప్లస్ నార్డ్ 2టి 5జి మీడియం 6.43 -ఇంచ్ FHD + రిజల్యూషన్ గల AMOLED డిస్ప్లేని కలిగి వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు ర్==గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క పవర్ ఫుల్ 5G ప్రాసెసర్ Dimensity 1300 శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు ARM G77 MC9 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది.
ఇక కెమెరాల పరంగా, వన్‌ప్లస్ నార్డ్ 2టి 5జి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX766 సెన్సార్ ని OIS సపోర్ట్ తో f/1.88 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని EIS సపోర్ట్ అందించింది. మూడవదిగా 2MP మోనో లెన్స్ ను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 32 MP సెల్ఫీ కెమెరాని SonyIMX615 సెన్సార్ తో అందించింది.
వన్‌ప్లస్ నార్డ్ 2టి 5జి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 80W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.