వన్‌ప్లస్ నార్డ్ 2: ప్రీమియం స్పెక్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది

HIGHLIGHTS

వన్‌ప్లస్ నార్డ్ 2 లాంచ్ అయ్యింది

వన్‌ప్లస్ 9 సిరీస్ కు దీటైన ఫీచర్లతో వచ్చింది

ఇండియాలో వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ ను ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ దాదాపుగా వన్‌ప్లస్ 9 సిరీస్ కు దీటైన ఫీచర్లతో వచ్చింది. వన్‌ప్లస్ నుండి తక్కువ ధరకు లభించే బెస్ట్ ఫోన్లలో ఒకటిగా వన్‌ప్లస్ నార్డ్ 2 నిలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన ప్రాసెసర్, బెస్ట్ కెమెరా ఫీచర్లు మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది.        

వన్‌ప్లస్ నార్డ్ 2: ధర

వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క బేస్ వేరియంట్ రూ.27,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ మరిన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 బ్లూ హేజ్, గ్రే సియారా మరియు గ్రీన్ ఉడ్స్ వంటి మూడు కలర్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 26 నుండి మొదలవుతుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2 : ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ 6.43 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల Fluid AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 1200-AI ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు ARM G77 MC9 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX766 సెన్సార్ ని OIS ఫీచర్ f/1.88 అపర్చర్ తో అందించింది. ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకటించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మోనో లెన్స్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 32 MP సెల్ఫీ కెమెరాని SonyIMX615 సెన్సార్ తో అందించింది.    

వన్‌ప్లస్ నార్డ్ 2 ఇన్ డిస్ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65W వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిముషాల ఛార్జింగ్ తో ఒక రోజుకు సరిపడిన ఛార్జ్ ను ఇవ్వగలదని వన్‌ప్లస్ తెలిపింది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :