Oneplus Clover: అత్యంత చవకైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కావచ్చు..ఆన్లైన్లో లీకైన స్పెక్స్

Updated on 07-Aug-2020
HIGHLIGHTS

Oneplus Clover, వన్ ప్లస్ క్లవర్ ఇక ఈ ఫోన్ వన్ ప్లస్ చరిత్రలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అవుతుందా?

Oneplus సంస్థ ఇటీవల ప్రకటించిన OnePlus NORD తో మిడ్ రేంజ్ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.

ప్రస్తుత గీక్ బెంచ్ లో దర్శనమిచ్చిన ఒక వన్ ప్లస్ ఫోన్ వివరాలను పరిశీలిస్తే మాత్రం వన్ ప్లస్ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లోకి కూడా అడుగుపెట్టాలని చూస్తున్నట్లు పక్కాగా అర్ధమవుతోంది.

Oneplus Clover, వన్ ప్లస్ క్లవర్ ఇక ఈ ఫోన్ వన్ ప్లస్ చరిత్రలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అవుతుందా?  ముందుగా, కేవలం కేవలం ప్రీమియం స్మార్ట్ ఫోన్లను మాత్రమే తీసుకొచ్చిన Oneplus సంస్థ ఇటీవల ప్రకటించిన OnePlus NORD తో మిడ్ రేంజ్ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. అయితే, ప్రస్తుత గీక్ బెంచ్ లో దర్శనమిచ్చిన ఒక వన్ ప్లస్ ఫోన్ వివరాలను పరిశీలిస్తే మాత్రం వన్ ప్లస్ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లోకి కూడా అడుగుపెట్టాలని  చూస్తున్నట్లు పక్కాగా అర్ధమవుతోంది. ఎందుకంటే, గీక్ బెంచ్ లో కనిపించిన ఈ ఫోన్ Snapdragon 660 SoC తో దర్శనమివ్వడమే, ఇటువంటి  అనుమానాలకు దారితీసేలా చేసింది.

ఈ ఫోన్ గురించి Geekbench లో కనిపించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఫోన్ యొక్క అప్డేట్ ఆగష్టు 5 వ తేదీకి ఇచ్చినట్లు చూపిస్తోంది. ఈ ఫోన్ 1.84 GHz బేస్ ఫ్రీక్వెన్సీ గల Snapdragon 660 SoC తో తీసుకొస్తున్నట్లు మరియు Oneplus Clover కోడ్ నేమ్ తో చూపిస్తోంది. ఇది 4 GB తో ఉన్నట్లు కూడా ఇందులో చూపించింది. అలాగే, ప్రస్తుత ప్రధాన ఆండ్రాయిడ్ పేపరేటింగ్ సిస్టం అయినటువంటి Android 10 పైన నడుస్తుంది.

కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ Oneplus Clover యొక్క స్కోర్స్ కూడా వివరించింది. ఇందులో సింగల్-కోర్ స్కోర్ నుండి 336 పాయింట్లను, సింగల్-కోర్ స్కోర్ నుండి 1495 పాయింట్లను సాధించింది. కాబట్టి, పైన పేర్కొన్న అన్ని వివరాలను ఆధారంగా చేసుకొని చూసినట్లయితే, ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, వన్ ప్లస్ నుండి ఇటీవల వచ్చిన Oneplus NORD కంటే కూడా చాలా చవకైన స్మార్ట్ ఫోనుగా అవతరించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :