OnePlus announced Diwali special offer on 12 series get free buds
OnePlus దివాళి ఆఫర్: దేశంలో 2024 దీపావళి కోలాహలం మొదలయ్యింది. ఇప్పటికే అనేక కంపెనీలు 2024 దీపావళి కోసం ఆఫర్స్ ప్రకటిస్తుండగా, వన్ ప్లస్ కూడా ఇప్పుడు గొప్ప డీల్స్ ను అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన వన్ ప్లస్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ పై ఈ డీల్స్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్స్ తో వన్ ప్లస్ 12 ఫోన్ ను తక్కువ ధరకు అందుకోవడమే కాకుండా చాలా 14 వేల రూపాయల విలువైన ప్రీమియం బడ్స్ ను కూడా ఉచితంగా అందుకోవచ్చు.
వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ మరియు ఆన్లైన్ స్టోర్ oneplus.in నుంచి ఈ దివాళి ఆఫర్స్ ను అందించింది. వన్ ప్లస్ ఈ బిడ్స్ డీల్స్ ను వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ పై అందించింది. వన్ ప్లస్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ ప్రీమియం ఫోన్ ను తక్కువ ధరకే అందుకోవచ్చు.
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 12GB మరియు 16GB వేరియంట్స్ పైన ఈ డీల్స్ అందించింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ రూ. 64,999 ధరతో మరియు 16GB ర్యామ్ వేరియంట్ రూ. 69,999 రూపాయల ధరతో సేల్ అవుతున్నాయి. అయితే, వన్ ప్లస్ దివాళి స్పెషల్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ లను అందుకోవచ్చు.
ఇక డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్ల పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందించింది. ఈ ఫోన్ లను ICICI, Kotak మరియు OneCard ఆప్షన్ లతో కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్స్ పైన రూ. 2,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Apple iPad Deal: లేటెస్ట్ యాపిల్ ఐప్యాడ్ పై అమెజాన్ సేల్ బిగ్ డీల్.!
పైన తెలిపిన బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ కాకుండా ఉచిత బడ్స్ ఆఫర్ ను కూడా అందించింది. వన్ ప్లస్ దివాళి సేల్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 13,999 రూపాయల విలువైన OnePlus Buds Pro 2 బడ్స్ ను ఉచితంగా అందిస్తున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని కూడా క్లియర్ గా చెబుతోంది.
అయితే, వన్ ప్లస్ ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగుస్తుంది.