ఈరోజు సాయంత్రం AR Launch ఈవెంట్ ద్వారా Oneplus Nord Launch

Updated on 21-Jul-2020
HIGHLIGHTS

వన్ ప్లస్ సరసమైన స్మార్ట్ ఫోన్ Oneplus Nord ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఒక ప్రత్యేకమైన AR Launch ఈవెంట్ ద్వారా విడుదల చేయనుంది.

ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా, AR Technology తో విడుదల చేస్తోంది.

Oneplus Nord Launch App ఇక్కడ నుండి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

చాలా కాలంగా వన్ ప్లస్ టీజ్ మరియు ప్రమోట్ చేస్తున్న, Oneplus Affordable Smartphone, అంటే వన్ ప్లస్ సరసమైన స్మార్ట్ ఫోన్ Oneplus Nord ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఒక ప్రత్యేకమైన  AR Launch ఈవెంట్ ద్వారా విడుదల చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా, AR Technology తో విడుదల చేస్తోంది. ఈ AR టెక్నాలజీని పూర్తిగా పలికితే అగ్మెంటేడ్ రియాలిటీ టెక్నాలజీ అంటారు. ఇది పూర్తిగా వినూత్నంగా వుంటుంది, అందుకే దీన్ని పూర్తిగా సరైన పద్ధతిలో చూసేందుకు వీలుగా ఈ లాంచ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఒక App ని కూడా తీసుకొచ్చింది. ఈ App గూగుల్ ప్లే స్టోర్ మరియు iOS వారికోసం App Store లో కూడా  అందుబాటులో ఉంచింది.

Oneplus Nord Launch App ఇక్కడ నుండి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Android స్మార్ట్ ఫోన్ల కోసం Onplus Nord AR

iOS  ఫోన్ల కోసం Onplus Nord AR    

పైన నొక్కడం ద్వారా నేరుగా ఇక్కడ నుండే డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది.

OnePlus Nord Leak స్పెసిఫికేషన్స్

వన్ ‌ప్లస్ నార్డ్ 6.55-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగి ఉందని రూమర్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఫోన్‌లో మూలలో డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ ఉండవచ్చని ఈ లీక్స్ సూచించాయి.

ఈ ఫోన్‌ను క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 620 జిపియుతో కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడింది మరియు మరిన్ని వేరియంట్‌లు కూడా ఉండవచ్చు.

వన్‌ ప్లస్ నార్డ్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు, ఇందులో ప్రాధమిక 64 ఎంపి కెమెరా, 16 ఎంపి అల్ట్రా-వైడ్-కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, సెల్ఫీలు కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మద్దతు ఉన్న 32MP ప్రాధమిక కెమెరా ఉంది.

ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌కు మద్దతుతో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడిందనే రూమర్ కూడా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :