Oneplus 9RT 5G: ఇండియాలో విడుదల కానున్న మరొక వన్ ప్లస్ ఫోన్

Updated on 04-Jan-2022
HIGHLIGHTS

Oneplus తన 9 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

Oneplus 9RT లాంచ్ డేట్ ఫిక్స్

అదే రోజున OnePlus Buds Z2 ట్రూ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది

Oneplus తన 9 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Oneplus 9RT 5G పేరుతొ తీసుకువస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో జనవరి 14 న లాంచ్ అవుతుంది. అదే రోజున OnePlus Buds Z2 ట్రూ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది. వాస్తవానికి, OnePlus 9R కి అప్‌గ్రేడ్ గా OnePlus 9RT 5G చైనాలో అక్టోబర్ 2021లో విడుదల చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 888 తో వచ్చింది.

ఇక  OnePlus Buds Z2 ట్రూ బడ్స్ విషయానికి వస్తే Active Noise Cancellation ఫీచర్ తో ఈ బడ్స్ ను తీసుకువస్తునట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. ఈ బడ్స్ కోసం అమెజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజ్ చేస్తోంది.

OnePlus 9RT 5G: స్పెసిఫికేషన్లు

OnePlus 9RT 5Gపెద్ద 6.62 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫికేషన్ తో FHD+ రిజల్యూషన్ తో కలిగి  ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు Adreno 660 GPU కలిగిన స్నాప్‌డ్రాగన్ 888 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఎంపికలతో జత చేయబడింది.

ఆప్టిక్స్ విషయానికి  వస్తే, OnePlus 9RT 5Gస్మార్ట్ ఫోన్  OIS సపోర్ట్ గల 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఈ ఫోన్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 29 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని OnePlus పేర్కొంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :