వన్‌ప్లస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ విడుదలయ్యాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ నుండి వన్‌ప్లస్ 9, 9 ప్రో మరియు 9R స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది. వీటిలో, వన్‌ప్లస్ 9R స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో వస్తుంది మరియు 9 ప్రో ఎక్కువ ధరలో వుంటుంది. అయితే, వన్‌ప్లస్ 9 సిరీస్ అన్ని స్మార్ట్ ఫోన్ లలో కూడా క్వాల్కమ్ యొక్క వేగవంతమైన ప్రాసెసర్, వ్రాప్ ఛార్జింగ్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్లను అందించింది.
వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో కూడా ప్రధాన కెమెరాలను మొత్తంగా Sony కెమెరాలను మాత్రమే వాడడం విశేషం. అంతేకాదు, మంచి ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడానికి అవసరమైన ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) లతో ఈ వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. అంతేకాదు, 12GB LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 ఫాస్ట్ స్టోరేజ్ అప్షన్ కూడా అందించింది.
ఇక ప్రొసెసర్ల విషయానికి వస్తే, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ తో ప్రకటించింది. వన్‌ప్లస్ 9R స్మార్ట్ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో, వన్‌ప్లస్ 9 మరియు Pro మోడల్ స్మార్ట్ ఫోన్ ను కూడా స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ శక్తితో అందించింది. ఛార్జింగ్ పరంగా కూడా 65W మరియు 65T వ్రాప్ ఛార్జింగ్ సపోర్ట్ ని టెక్నాలజీతో అందించింది.