1 rupee కు లేటెస్ట్ గా రిలీజ్ అయిన OnePlus 3T స్మార్ట్ ఫోన్, ఇయర్ ఫోన్స్ & accessories

Updated on 02-Jan-2017

Oneplus కంపెని డిసెంబర్ dash సేల్స్ కు రెడీ అవుతుంది.  ఇది పర్టికులర్ డేట్స్ లో డిసెంబర్ నెల అంతా ఉండనుంది. కంపెని కొత్తగా oneplus 3T ఫోన్ రిలీజ్ చేసింది.

ఈ ఫోన్ ను ఇప్పుడు క్రింద చెప్పబడిన డేట్స్ లో registered users కు oneplus స్టోర్ లో కేవలం ఒక్క రూపాయి కే కొనే అవకాశం ఇస్తుంది Oneplus. రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉంది.

డిసెంబర్ 9, 16, 23 మరియు 30 న కంపెని స్టోర్ లో మధ్యాహ్నం 12 నుండి సాయింత్రం 6 వరకూ ఈ సేల్స్ మొదలవుతాయి. 3T ఫోన్ తో పాటు earphones, కాలేజ్ బ్యాగ్, cases, accessories కూడా 1 rupee కు గెలుచుకోగలరు.

సేల్స్ లో పాల్గొనాలంటే ఏమి చేయాలి?

ముందుగా oneplus  స్టోర్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్  డిటేల్స్ నింపి అకౌంట్ క్రియేట్ చేయాలి ( store లింక్ ). ఈ డిటేల్స్ ఐటెం ను కొనేటప్పుడు ఎంటర్ చేయకుండా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటానికి. తరువాత ఆఫర్ వివరాలను లింక్ ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయాలి. ఇప్పుడు register అయ్యినట్లే మీరు.

మీ లింక్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే మీకు పాయింట్స్ ఇస్తుంది. ఒక 6 members చే రిజిస్టర్ చేయించినా మీరు 1 రూపాయి కి oneplus ఐటెం కొనవచ్చు అని అంటుంది కంపెని. కంపెని తెలిపిన సమాచారం ప్రకారం పాయింట్స్ పెరిగేకొద్దీ హై వాల్యూ ఐటెం కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోగలరు.

అంతే! ఇక మీరు సొంతం చేసుకున్న పాయింట్స్ కు అనుగుణంగా పైన చెప్పబడిన డేట్స్/టైమింగ్ లో Oneplus ఐటమ్స్ (ear ఫోన్స్, 3T ఫోన్, టి షర్ట్స్, cases, బాగ్స్, Flip Cases, Dash chargers, డాష్ కార్ chargers etc) ను cart లో యాడ్ చేసుకోగలిగితే మీరు వాటిని 1rupee కే కొనే అవకాశం ఉంది.

దీనితో పాటు వీక్లీ ప్రైజ్ కూడా ఉంది. అంటే పాయింట్స్ తో సంబంధం లేకుండా రిజిస్టర్ అయిన యూసర్ కు, డిసెంబర్ లోని ప్రతీ శనివారం కంపెని రాండమ్ గా విన్నర్ ను ఎంచి, వాళ్ళకు oneplus 3T ను అందిస్తుంది. విన్నర్ కు మెయిల్ చేస్తుంది.

సో ఫోన్ నంబర్ అదీ fill చేసి రిజిస్ట్రేషన్ చేసి పాయింట్స్ స్కోర్ చేయటం time వెస్ట్ అనుకునేవారికి కూడా పాయింట్స్ లేకపోయినా oneplus 3T win అయ్యే అవకాశం కలిపిస్తుంది కంపెని. కంప్లీట్ ఆఫర్ గురించి మరిన్ని డిటేల్స్ కొరకు  ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? / ఎలా రిజిస్టర్ అవ్వాలి?

  • ముందుగా  మీరు ఈ లింక్ పై క్లిక్ చేసి oneplus ఆఫర్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
  • సైట్ ఓపెన్ అయిన తరువాత, కొంచెం క్రిందకు స్క్రోల్ చేస్తే Entry Challenge అని వైట్ కలర్ లో హెడ్డింగ్ ఉంటుంది. దాని క్రింద  Get your Oneplus Account ready అని ఉంటుంది. అక్కడే దాని ప్రక్కన రైట్ సైడ్ Sign In అని కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు  మీరు కొత్త పేజ్ లోకి వెళ్తారు. అక్కడ sign up with e-mail అని ఉంటుంది. దానిపై టాప్ చేయండి.
  • username, email, password ఎంటర్ చేసిన తరువాత క్రింద I'm not robot అని ఉన్న బాక్స్ పై టచ్ చేసి క్రింద ఉన్న రెడ్ కలర్ sign up బటన్ పై టాప్ చేయండి.
  • ఇప్పుడు మీ మెయిల్ కు confirmation మెయిల్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి కచ్చితంగా confirm చేయాలి.
  • ఇప్పుడు మరలా Entry Challenge హెడ్డింగ్ క్రింద ఉన్న ఇతర మూడు (ఫోన్ నంబర్, ఫోన్ షిప్పింగ్ అడ్రెస్ మరియు సోషల్ నెట్వర్కింగ్ షేరింగ్ ) పనులు చేయాలి.

oneplus 3T యొక్క కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.. గమనిక: చాలామంది దీనిపై ఆర్టికల్ వ్రాయమని అడగగా తెలిపిన సమాచారం మాత్రమే ఇది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :