OnePlus 15R launching with sd gen 5 chipset and 165Hz display
OnePlus 15R: వన్ ప్లస్ 15 సిరీస్ నుంచి మరో పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి వన్ ప్లస్ సిద్దమయింది. 165Hz పవర్ ఫుల్ స్క్రీన్ మరియు SD Gen 5 కొత్త చిప్ సెట్ వంటి అనేక పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ ఇప్పటికే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ టీజర్ తో అదరగొడుతోంది. రీసెంట్ గా వన్ ప్లస్ 15 సిరీస్ నుండి కొత్త ఫోన్ అందించిన కంపెనీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి ఈ ఫోన్ డౌన్ వెర్షన్ ఫోన్ లాంచ్ ప్రకటించింది.
వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 17వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తో పాటు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 కూడా విడుదల చేస్తుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ కొత్తగా అందించిన పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Gen తో లాంచ్ చేస్తుంది. దానికి జతగా స్క్రీన్ కోసం ప్రత్యేకమైన టచ్ రెస్పాన్స్ చిప్ మరియు నెట్ వర్క్ కోసం ప్రత్యేకమైన Wi-Fi చిప్ కూడా అందించింది. ఇది పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు జతగా వచ్చిన చిప్ లు ఈ ఫోన్ ను మంచి గేమింగ్ ఫోన్ గా నడిచేలా చేస్తాయి.
ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ఉందని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఇది HD గేమింగ్ కు తగిన 120Hz స్మూత్ విజువల్స్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా లైఫ్ టైమ్ డిస్ప్లే వారంటీ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హెవీ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో వస్తుంది. ఈ రేటింగ్ తో ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Also Read: ప్రైవసీకి గొడ్డలి పెట్టు: Phone Number ఉంటే చాలు పూర్తి వివరాలు చెబుతున్న ఆన్‌లైన్ సైట్.!
ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా తో లాంచ్ అవుతున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఫోన్ ను కూడా వన్ ప్లస్ లేటెస్ట్ ఆక్సిజన్ OS 16 తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే వన్ ప్లస్ ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ రివీల్ చేస్తుంది కాబట్టి, మరిన్ని అప్‌డేట్ తో మళ్ళీ కలుద్దాం.