OnePlus 15R 5G: పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!

Updated on 17-Dec-2025
HIGHLIGHTS

వన్ ప్లస్ 15 సిరీస్ నుంచి రెండో ఫోన్ ను వన్ ప్లస్ ఈరోజు విడుదల చేసింది

OnePlus 15R 5G స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ సెగ్మెంట్ అండ్ వరల్డ్ ఫస్ట్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది

OnePlus 15R 5G : వన్ ప్లస్ 15 సిరీస్ నుంచి రెండో ఫోన్ ను వన్ ప్లస్ ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ సెగ్మెంట్ అండ్ వరల్డ్ ఫస్ట్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

OnePlus 15R 5G: ప్రైస్

వన్ ప్లస్ ఈ ఫోన్ రూ. 47,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ఫోన్ రూ. 52,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మింట్ బ్రీజ్, చార్కోల్ బ్లాక్ మరియు ఎలక్ట్రిక్ వయొలెట్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 3,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ముందుగా ఈ ఫోన్ తీసుకునే వారికి (లిమిటెడ్ స్టాక్ పై) రూ. 2,299 విలువైన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే పై లైఫ్ టైమ్ వారంటీ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ఈరోజు నుంచి వన్ ప్లస్ ప్రారంభించింది.

OnePlus 15R 5G: ఫీచర్స్

వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ LTPS AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60-165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 12 జీబీ LPDDR5x అల్ట్రా ఫాస్ట్ ర్యామ్ మరియు 512 జీబీ UFS 4.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్సిజన్ 16.0OS సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX 906 మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 4K స్లోమోషన్ వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Earbuds Buying Guide: కొత్త బడ్స్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

ఈ ఫోన్ టచ్ రెస్పాన్స్ చిప్ మరియు G2 Wi-Fi చిప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా భారీ 7400 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ ఇండస్ట్రీ బెస్ట్ IP రేటింగ్ గా చెప్పబడే IP66, IP68, IP69 మరియు IP69K సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :