OnePlus 15: కంప్లీట్ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 13-Nov-2025
HIGHLIGHTS

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ను కంప్లీట్ ప్రీమియం ఫీచర్స్ తో వన్ ప్లస్ లాంచ్ చేసింది

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ గా వన్ ప్లస్ 15 నిలుస్తుంది

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంప్లీట్ ప్రీమియం ఫీచర్స్ తో వన్ ప్లస్ లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ గా వన్ ప్లస్ 15 నిలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మొదలుకొని బ్యాటరీ వరకు అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ పై ఒక లుక్కేద్దామా.

OnePlus 15 : ప్రైస్

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇందులో బేసిక్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 72,999 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది మరియు హైఎండ్ (16GB + 512GB) వేరియంట్ ను రూ. 79,999 ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 4,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ఇన్ఫినైట్ బ్లాక్, అల్ట్రా వయోలెట్ మరియు సాండ్ స్ట్రోమ్ మూడు కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేసింది. కస్టమర్లు ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ అఫీషియల్ వెబ్సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్ మరియు అమెజాన్ నుంచి పొందవచ్చు.

Also Read: ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా Android Phone Apps ఎలా లాక్ చేయాలి.!

OnePlus 15 : ఫీచర్స్

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది మరియు ఈ చిప్ సెట్ ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్ 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఆక్సిజన్ OS 16 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16OS తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 165Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10+ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony IMX 906) మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో (3.5X ఆప్టికల్ జూమ్) కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K 120FPS Dolby Vision సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50W ఎయిర్ ఊక్ మరియు 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7300 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K నాలుగు IP రేటింగ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ Meet Plus Mind సపోర్ట్ తో సూపర్ ఇంటెలిజెంట్ ఫోన్ గా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :