OnePlus 15 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!

Updated on 21-Oct-2025
HIGHLIGHTS

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది

ముందుగా ఈ ఫోన్ చైనా లాంచ్ గురించి మాత్రమే అనౌన్స్ చేసిన వన్ ప్లస్

ఇప్పుడు ఇండియా లాంచ్ గురించి కూడా కన్ఫర్మ్ చేసింది

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది. ముందుగా ఈ ఫోన్ చైనా లాంచ్ గురించి మాత్రమే అనౌన్స్ చేసిన వన్ ప్లస్ ఇప్పుడు ఇండియా లాంచ్ గురించి కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ మొదలు పెట్టింది. మరి వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు ఏమిటో చూద్దామా.

OnePlus 15 ఇండియా లాంచ్ డేట్?

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15 ఇండియా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, అక్టోబర్ 27న చైనా మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన వివరాలు తెలియజేస్తూ ఈ ఫోన్ కోసం భారీ స్థాయిలో టీజింగ్ మాత్రం ప్రారంభించింది.

OnePlus 15 కీలక ఫీచర్స్ ఏమిటి?

ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ కీలకమైన వివరాలు మరియు డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ లను కూడా అందించింది. ఈ పేజీ ద్వారా వన్ ప్లస్ తెలియచేసిన వివరాల్లో కెమెరా, డిజైన్ మరియు ఈ ఫోన్ చిప్ సెట్ వంటివి ఉన్నాయి.

వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని క్వాల్కమ్ లేటెస్ట్ ప్రీమియం చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది 40 లక్షల కంటే అధికమైన AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ చిప్ సెట్ అని క్వాల్కమ్ ముందే ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ మినీ కంప్యూటర్ మాదిరి వేగం కలిగి ఉంటుంది కాబోలు అని కొందరు ముద్దగా పిలుస్తున్నారు.

ఈ ఫోన్ వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఆక్సిజన్ OS 16 తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ఇది చాలా అడ్వాన్స్డ్ బిల్ట్ ఇన్ AI కలిగిన ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెడుతుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో దర్శనమిచ్చింది. ఈ ఫోన్ చూడటానికి ఇటీవల వచ్చిన వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి కాంపాక్ట్ డిజైన్ లో కనిపిస్తుంది.

Also Read: డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేలకే లభిస్తోంది.!

ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను కేవలం ‘Coming Soon’ ట్యాగ్ తో వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ కూడా వన్ ప్లస్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :