OnePlus 15 5G What is Expected So Far and rumoured
OnePlus 15 5G: నెట్టింట్లో వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ అంచనా వివరాలు ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇంకొక విశేషం కూడా వుంది వన్ ప్లస్ 13 సిరీస్ తర్వాత వన్ ప్లస్ 14 సిరీస్ ను దాటవేసి వన్ ప్లస్ 15 సిరీస్ లాంచ్ చేస్తుందని ఇది చెబుతోంది. అందుకే, ఈ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. వన్ ప్లస్ 15 5జి ఫోన్ లాంచ్ మరియు ఫీచర్లు గురించి కూడా చాలా రూమర్లు ఉన్నాయి.
వన్ ప్లస్ 15 5జి స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 2025 నెలలో చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొత్తగా రూమర్లు నడుస్తున్నాయి. అలాగే, ఈ ఫోన్ 2026 ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని కూడా ఈ రూమర్లు చెబుతున్నాయి. ఈ ఫోన్ స్పెక్స్ గురించి కూడా రూమర్లు ఉన్నాయి. వీటి అనుగుణంగా ఈ ఫోన్ స్పెక్స్ అంచనా వేస్తున్నారు.
వన్ ప్లస్ 15 5జి స్మార్ట్ ఫోన్ 6.7 నుంచి 6.8 ఇంచ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్క్రీన్ LTPO టెక్నాలాజి, 1.5 K రిజల్యూషన్, 120–165Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉండే అవకాశం ఉందంటూ రూమర్లు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ ఫోన్ చిప్ సెట్ గురించి ఎక్కువగా పుకార్లు ఉన్నాయి. అవేమిటంటే, వన్ ప్లస్ 15 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ Snapdragon 8 Elite Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ మరియు హై ఎండ్ AI సపోర్ట్ కలిగి ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు వన్ ప్లస్ ప్రీమియం సిరీస్ లో ఉపయోగించిన Hasselblad బ్రాండింగ్ వన్ ప్లస్ 15 ఫోన్ లో ఉండకపోవచ్చని కూడా రూమర్లు ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ లో వెనుక మూడు 50MP ప్రీమియం కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉందని అంచనా. ఇందులో వైడ్ , అల్ట్రా వైడ్ మరియు పెరిస్కోప్ సెన్సార్లు ఉంటాయి. ఇందులో గొప్ప ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని చెబుతున్నారు.
Also Read: Lava Bold N1 5G: స్టన్నింగ్ డిజైన్ తో కొత్త లాంచ్ ప్రకటించిన లావా.!
బ్యాటరీ మరియు ఛార్జింగ్ సపోర్ట్ గురించి కూడా రూమర్లు ఉన్నాయి. వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 7000 mAh బ్యాటరీతో తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 100W నుంచి 120W ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని ఈ రూమర్లు చెబుతున్నారు. అయితే, ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఇవన్నీ కూడా నిపుణులు మరియు మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్న వివరాలు మాత్రమే అని గుర్తుంచుకోండి.
Note : ఈ ఫోన్ ఇమేజ్ వన్ ప్లస్ 13 ఫోన్ ఇమేజ్ అని గమనించాలి. వన్ ప్లస్ 15 రెండర్ లేదా ఇమేజ్ ఇంకా రిలీజ్ కాలేదని గమనించాలి.