OnePlus 13R now available with rs 7000 discount offers on amazon
వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus 13R పై అమెజాన్ ఇండియా రూ. 7000 రూపాయల విలువైన భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్స్ దెబ్బకు ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం మిడ్ రేంజ్ ధరకే అందుకునే అవకాశం లభిస్తుంది. లేటెస్ట్ చిప్ సెట్ మరియు OnePlus AI సపోర్ట్ తో వచ్చిన ఈ ఫోన్ ను ఇప్పుడు రూ. 7,000 రూపాయల తక్కువ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ కల్పించింది.
వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 42,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అమెజాన్ నుంచి కూడా ఈరోజు అదే ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై అమెజాన్ రెండు గొప్ప అదనపు డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అందుకే, ఈ ఫోన్ ఈ ఆఫర్స్ తో తక్కువ ధరకు లభిస్తుంది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫై రూ. 4,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ పై టోటల్ రూ. 7000 తగ్గింపు అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 35,998 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
Also Read: Apple iPhone 16e: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.!
వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 ఫ్లాగ్ షిప్ సీపీ సెట్ తో లాంచ్ అయ్యింది. దీనికి జతగా ఈ ఫోన్ లో LPDDR5X 12GB RAM మరియు 256GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ Pro XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ LTPO 4.1, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony LYT-700) మెయిన్, 50MP (S5KJN5) టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ తో 60fps/30fps తో 4K వీడియోలు, Auto HDR మరియు హై రిజల్యూషన్ ఫోటోలు పొందవచ్చు. ఈ ఫోన్ OnePlus AI తో వస్తుంది మరియు AI అన్ బ్లర్, AI డీటెయిల్ బూస్ట్ వంటి మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీని 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.