OnePlus 11R 5G: కీలకమైన ఫీచర్లు రివీల్ చేసిన కంపెనీ..భారీ ఫీచర్లతో వస్తున్న ఫోన్.!

HIGHLIGHTS

వన్ ప్లస్ ఇండియాలో కొత్త ఫోన్లను విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది

వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన Fluid డిస్ప్లేతో వస్తుంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేయండి

OnePlus 11R 5G: వన్ ప్లస్ ఇండియాలో కొత్త ఫోన్లను విడుదల చెయ్యడానికి జనవరి 7 ను డేట్ గా ఫిక్స్ చేసింది. అదే OnePlus 11R 5G మరియు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ మరియు గొప్ప కలర్స్ అందించ గల డిస్ప్లే మరియు అత్యంత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తునట్లు వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేయండి. 

OnePlus 11R 5G: రివీల్డ్ స్పెక్స్

వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన Fluid డిస్ప్లేతో వస్తుంది. ఇది ADFR 2.0 టెక్ తో కంటెంట్ కు అనుగుణంగా  40Hz, 45Hz, 60Hz, 90Hz మరియు 120Hz మధ్య మారుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో పనిచేస్తుందని కంపెనీ కన్ఫమ్ చేసింది. దీనికి జతగా 16GB ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందని వన్ ప్లస్ పేర్కొంది. 

వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, ఈ కెమెరాల వివరాలు మాత్రం కంపెనీ తెలియచెయ్యలేదు. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఛార్జింగ్ టెక్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 21 నిముషాల్లోనే 1-100% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఉత్తమ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో హైపర్ బూస్ట్ గేమ్ ఇంజన్ కూడా ఉన్నట్లు తెలిపింది.

ఇవన్నీ చూస్తుంటే భారీ ఫీచర్లతో ఈ OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసే అవకాశం ఉంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :