రేపు విడుదల కానున్న OnePlus 10T స్మార్ట్ ఫోన్.. ఇవే ఫీచర్లు.!

HIGHLIGHTS

OnePlus 10T రేపు సాయంత్రం విడుదలకు సిద్ధమవుతోంది

ఈ స్మార్ట్ ఫోన్ న్యూయార్క్ నగరంలో విడుదల చేయబడుతుంది

OnePlus 10T స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+AMOLED డిస్ప్లే వుంది

OnePlus 10T రేపు సాయంత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 3న న్యూయార్క్ నగరంలో విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ గురించి వన్ ప్లస్ చాలా కాలంగా అనేక అంచనాలు అందించడమే కాకుండా టీజింగ్ కూడా మొదలుపట్టింది. ఈ ఫోన్ యొక్క కొన్ని వివరాలను కూడా కంపెనీ ఇప్పటికే టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. 

వన్ ప్లస్ టీజర్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 శక్తితో పనిచేస్తుంది. ఈ OnePlus 10T లో బ్రాండ్ యొక్క ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ మరియు హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్ ఉండదని కూడా వెల్లడయ్యింది. OnePlus 10T 5G ఆక్సిజన్ OS 13తో ప్రారంభించబడుతుంది. ఈ ఫోన్ జేడ్ గ్రీన్ మరియు మూన్ స్టోన్ బ్లాక్ అనే రెండు విభిన్నమైన కలర్ అప్షన్ లలో వస్తుంది.

 OnePlus 10T స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+AMOLED డిస్ప్లే వుంది. అలాగే, 3D కూలింగ్ సిస్టం,హైపర్ బూస్ట్ గామా ఇంజన్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.  OnePlus 10T స్మార్ట్ ఫోన్ అత్యున్నత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ స్పోర్ట్ కలిగిన బ్యాటరీ సెటప్ తో వస్తుంది. కెమెరాల పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగివుంటుంది. ఇది OIS మరియు EIS సపోర్ట్ కలిగిన ఫ్లాగ్‌షిప్ 50MP సోనీ IMX766 సెన్సార్ ద్వారా అందించబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :