OnePlus 9RT 5G: 50MP ట్రిపుల్ కెమెరా, 65W డార్ట్ ఛార్జ్ తో వచ్చింది

HIGHLIGHTS

వన్ ప్లస్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus 9RT 5G ను ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ తో పాటుగా OnePlus Buds Z2 ట్రూ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది

50MP Sony IMX766 సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది

ఈరోజు ఇండియాలో వన్ ప్లస్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus 9RT 5G ను ప్రవేశపెట్టింది. ఈరోజు నిర్వహించిన వింటర్ ఎడిషన్ లాంచ్ కార్యక్రమం ద్వారా ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ తో పాటుగా OnePlus Buds Z2 ట్రూ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ముందు నుండే ఈ ఫోన్ గురించి చాలా రూమర్లు మరియు లీక్స్ ఆన్లైన్ లో కనిపించాయి. అయితే, ఈ రోజు ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ను వేగవంతమైన క్వాల్కమ్ ప్రోసెసర్, OIS సపోర్ట్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.       

OnePlus 9RT 5G: ధర

వన్ ప్లస్ 9RT 5G యొక్క  8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్‌ రూ. 42,999 ధరతో, 12GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 46,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ నానో సిల్వర్ మరియు హ్యాకర్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ జనవరి 17 నుండి అమెజాన్, వన్ ప్లస్ వెబ్సైట్ మరియు అన్ని రిటైల్ స్టోర్స్ లో అమ్మకానికి వస్తుంది.

OnePlus 9RT 5G: స్పెసిఫికేషన్లు

OnePlus 9RT 5Gపెద్ద 6.6 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫికేషన్ తో FHD+ రిజల్యూషన్ తో కలిగి  ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు Adreno 660 GPU కలిగిన స్నాప్‌డ్రాగన్ 888 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఎంపికలతో జత చేయబడింది.

ఆప్టిక్స్ విషయానికి  వస్తే, OnePlus 9RT 5Gస్మార్ట్ ఫోన్ OIS మరియు EIS సపోర్ట్ గల 50MP ప్రైమరీ Sony IMX766 సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ కెమెరాతో 30/60fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించవచ్చు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఈ ఫోన్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ 65W వ్రాప్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :