One Community Sale నుంచి వన్ ప్లస్ కొత్త ఫోన్ల పైన ధమాకా ఆఫర్లు.!

HIGHLIGHTS

ఈరోజు వన్ ప్లస్ కొత్త సేల్ One Community Sale ను ప్రకటించింది

ఈ సేల్ నుంచి కొత్త ఫోన్ లతో పాటు చాలా ప్రొడక్ట్స్ పై భారీ ఆఫర్లు అందించింది

ఈ సేల్ ను అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ నుండి కూడా నిర్వహిస్తోంది

ఈరోజు వన్ ప్లస్ కొత్త సేల్ One Community Sale ను ప్రకటించింది. ఈ సేల్ నుంచి కొత్త ఫోన్ లతో పాటు చాలా ప్రొడక్ట్స్ పై భారీ ఆఫర్లు అందించింది. ఈ సేల్ ను వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ నుండి కూడా నిర్వహిస్తోంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 12 సిరీస్ మొదలు కొని లేటెస్ట్ వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ లతో సహా చాలా ఫోన్ల పైన గొప్ప డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. 

One Community Sale

వన్ కమ్యూనిటీ సేల్ జూన్ 6 తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు జరగనున్నది. 5 రోజుల పాటు జరగనున్న ఈ సేల్ నుంచి వన్ ప్లస్ ప్రొడక్ట్స్ ను గొప్ప డిస్కౌంట్ ఆఫర్ లతో అందుకునే అవకాశం అందించింది. వన్ ప్లస్ ఈ సేల్ నుండి చాలా ఫోన్ల పైన స్పెషల్ కూపన్, డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.  ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. 

అమెజాన్ సైట్ పైన వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి అందిస్తున్న ఆఫర్లలో మూడు గొప్ప స్మార్ట్ ఫోన్ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో, వన్ ప్లస్ నార్డ్ 3 5జి, వన్ ప్లస్ 11R 5జి మరియు వన్ ప్లస్ 12 5జి ఫోన్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ల పైన అందించిన ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.   

వన్ ప్లస్ నార్డ్ 3 5జి

వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 33,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో వచ్చింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సైట్ పై నడుస్తున్న వన్ ప్లస్ సేల్ నుండి రూ. 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. Buy From Here

వన్ ప్లస్ 11R 5జి

One Community Sale Offer

వన్ ప్లస్ 11R 5జి స్మార్ట్ ఫోన్ కూడా ఈ సేల్ నుండి బొప్ప డిస్కౌంట్ తో లభిస్తుంది. భారత్ మార్కెట్లో రూ. 39,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ వన్ కమ్యూనిటీ సేల్ నుండి రూ. 12,000 రూపాయల గొప్ప డిస్కౌంట్ తో ఇప్పుడు కేవలం రూ. 27,999 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ధరకు లభిస్తోంది. Buy From Here

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 గంటలు పనిచేసే TWS Buds లాంచ్.!

వన్ ప్లస్ 12 5జి

ఈ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేయబడింది. ఈ ఫోన్ పైన కూడా వన్ ప్లస్ మరియు అమెజాన్ గొప్ప ఆఫర్లను ఈ వన్ కమ్యూనిటీ సేల్ నుండి అందించాయి. ఈ ఫోన్ ఈ సేల్ నుంచి రూ. 64,999 రూపాయల ధరతో లిస్ట్ చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను ఈ సేల్ నుంచి అందించింది. Buy From Here

ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను ఈ సేల్ నుంచి రూ. 59,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ను అందుకోవడానికి ఈ ఫోన్ ను HDFC, IDFC, ICICI, BOB మరియు OneCard కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Buy From Here      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :