ఏకంగా రూ. 7000 ధర తగ్గిన, శామ్సంగ్ గెలాక్సీ S9+

HIGHLIGHTS

శామ్సంగ్ ఇండియా యొక్క ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరకి అందుబాటులో వుంది.

ఒక కొత్త గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్ యొక్క ఎంట్రీ కోసం శామ్సంగ్ యొక్క గెలాక్సీ ఎస్ 9+ ధరలను అధికంగా శామ్సంగ్ తగ్గించింది. ముందుగా, గెలాక్సీ S9+ 64GB వేరియంటును రూ. 64,900 ధరతో భారతీయ మార్కెట్లోకి తీసుకురాగా, ఇప్పుడు ఏకంగా 7000 రూపాయల ధరను తగ్గించి రూ. 57,900 రూపాయలకు అందిస్తోంది.

అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 128GB వేరియంట్ రూ. 67,900 రూపాయల ద్గరతో విడుదల కాగా, ప్రస్తుతం 61,900 రూపాయలకు ధరతో అందుబాటులో వుంది. మరొక వేరియంట్ అయినటువంటి, 256 GB  వేరియంట్ ఇప్పుడు  65,900 రూపాయల ధరతో అందుబాటులో వుంది.కానీ,     దీని యొక్క గత ధర రూ. 71,900 రూపాయలుగా వుంది.

అయితే ముందుగా ఈ ధరను కేవలం ఆఫ్ లైన్ దుకాణాలలో మాత్రమే ధర తగ్గింపు వర్తించిందని కొన్ని నివేదికలలో వచ్చింది. కానీ, ఈ అప్డేట్ చేయబడిన ధరలతో శామ్సంగ్ ఇండియా యొక్క ఆన్లైన్ వెబ్సైట్  వేదికగా నిలచింది. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన, పాత ధరలతోనే ఈ స్మార్ట్ ఫోన్ను డిస్ప్లే చేసిచూపిస్తున్నాయి.  మీరు ఈ స్మార్ట్ ఫోన్  కొనుగోలు చేయాలనీ  ఎదురుచూస్తున్నట్లైతే, శామ్సంగ్ ఇండియా యొక్క ఆన్లైన్ వెబ్సైట్ లో తగ్గించిన ధరలకు  ధరకి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో వుంది కాబట్టి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ, మీరు మరొక ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా శామ్సంగ్ ఇండియా యొక్క ఆన్లైన్ వెబ్సైట్ లో ప్రకటించిన ధరలతో వాటిని  సరిపోల్చి సరైన ధరలను ఎంచుకుని కొనుగోలు చేయండి మరియు 7000 రూపాయల ప్రయోజనాన్ని అందుకోండి.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :