రియల్మీ 2 ప్రో పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించిన రియల్మీ

HIGHLIGHTS

Axis బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో వినియోగదారులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.

రియల్మీ 2 ప్రో పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించిన రియల్మీ

రియల్మీ సంస్థ, ఒప్పో నుండి విడిపోయిన తరువాత సెప్టెంబరులో Realme 2 Pro ను ఇండియాలో విడుదల చేసింది.  ఈ స్మార్ట్ఫోన్ ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే  తెస్తుంది మరియు Oppo నుండి విడిపోయిన తర్వాత ఇది సంస్థ యొక్క రెండవ ఫోన్ . ముందుగా, ఈ రియల్మీ ప్రో రూ. 13,990 ప్రారంభ ధర వద్ద ఆవిష్కరించారు. కానీ, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పైన రియల్మీ 1,000 రుపాయల తగ్గింపు ప్రకటించింది. కాబట్టి, ఈ రియల్మీ2 ప్రో ని కేవలం రూ.12,990 రూపాయల ప్రారంభ దరతో కొనవచ్చు. అదనంగా, Axis బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. అలాగే, అతితక్కువ EMI ఎంపికలు కూడా అందుబాటులో వున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. 4GB RAM మరియు 64GB స్టోరేజి అఫర్ ధర – Rs. 12,990 (ముందుగా ఉన్న ధర -Rs.13,990) Link

2. 6GB RAM మరియు 64GB స్టోరేజి అఫర్ ధర – Rs. 14,990 (ముందుగా ఉన్న ధర -Rs.15,990) Link

Realme 2 ప్రో ధర మరియు ప్రత్యేకతలు

రియల్మీ 2 ప్రో ఒక 6.3-అంగుళాల ఫుల్ HD + ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే లో 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 19.5: 9 యొక్క యాస్పెక్ట్  రేషియో కలిగిన వాటర్ డ్రాప్ నోచ్ కలిగివుంటుంది. ఈస్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 SoC శక్తితో నడుస్తుంది మరియు అడ్రినో 512 GPU తో జత చేయబడింది. ఇది  4GB RAM + 64GB నిల్వ, 6GB RAM + 64GB నిల్వ మరియు 8GB RAM + 128GB అంతర్గత  నిల్వ వంటి మూడు రకాలైన వేరియంట్లలో లభిస్తుంది. ఈ 4GB వేరియంట్ ప్రస్తుత ధర రూ. 12,990. అలాగే,  6GB వేరియంట్ వినియోగదారులకు 14,990 రూపాయలు మరియు  8GB వేరియంట్ 16,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. విడుదల సమయంలో, రియల్మి యొక్క ఈ స్మార్ట్  ఈ ధర వద్ద లభించే, ప్రపంచంలో మొట్టమొదటి Dewdrop ఫుల్ స్క్రీన్ అని పేర్కొన్నారు.

రియల్మీ 2 ప్రో ఒక 16MP సోనీ IMX398 ప్రాధమిక 6P సెన్సారుతో బ్యాక్ ప్యానెల్లో డ్యూయల్-కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది, దీనిని ఒక F / 1.7 ఎపర్చరుతో కలిగి ఉంటుంది, ఇది 2MP సెకండరీ లెన్స్ తో జత చేయబడింది. కెమెరా డ్యూయల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకస్ మరియు EIS వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. వెనుక ప్యానెల్లో కూడా వేలిముద్ర సెన్సార్ ఉంది. ముందు, రియల్ 2 ప్రో ఒక f / 2.0 ఎపర్చరుతో 16MP లెన్స్ తో వస్తుంది. ఫోన్ స్పష్టంగా 296 ముఖ గుర్తింపు పాయింట్లు గుర్తించి ఎనిమిది మిలియన్ వ్యక్తిగతీకరించిన బ్యూటిఫై పరిష్కారాలను అందించే కొత్త AI షాట్ ఫీచర్ తో వస్తుంది. ఈ Realme 2 Pro,  Android 8.1 Oreo OS ఆధారితమైన ColorOS 5.2 తో నడుస్తుంది . ఈ ఫోన్ మూడు కలర్ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది: ఐస్ లేక్, బ్లాక్ సీ  మరియు బ్లూ

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo