హానర్ వ్యూ 20 యొక్క ఇండియా ధర లీక్, ఇది Rs. 35,999 ధరతో ఉండే అవకాశం : రిపోర్ట్

Updated on 25-Jan-2019
HIGHLIGHTS

జనవరి 29 న ఇండియాలో విడుదలకానున్న, హానర్ వ్యూ 20 లేదా హానర్ V20,ఇప్పటికే చైనా మరియు కొన్ని ఇతర మార్కెట్లలో విడుదల చేయబడింది.

హానర్ వ్యూ 20 స్మార్ట్ ఫోన్, జనవరి 29 న ఇండియాలో విడుదల అవనున్నది మరియు All -View డిస్ప్లేతో, భారతదేశంలో విడుదలకానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవడం విశేషం. అంటే దీనర్ధం, దీని డిస్ప్లే కటౌట్ ఒక సెల్ఫీ కెమెరాతో వస్తుంది. చాల నివేదిక ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా ధర ఇప్పుడు లీక్ అయ్యింది మరియు ఇది RS. 35,999 ధరతో కనుగోలుదారులకి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ, ఇదే కనుక నిజమైతే, ఇది ఇటువంటి ధర పరిధిలో Rs. 37,999 ధరతో ముందుగా విడుదలైనటువంటి, OnePlus 6T తో పోటీపడుతుంది.   

యూరప్ లో,  ఈ హానర్ V20 యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజి  వేరియంట్  569 యురోస్ (దాదాపు రూ. 46,000) ధరతో ఉంటుంది. అలాగే, 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కోసం వినియోగదారులు 649 (సుమారు రూ 52,500) ధర చెల్లించాల్సివుంటుంది. చైనాలో,  6GB RAM మరియు 128GB స్టోరేజి  వేరియంట్  CNY 2999 (దాదాపు రూ. 30,000) ధరతో ఉంటుంది. అలాగే, 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కోసం వినియోగదారులు CNY 3499 (సుమారు రూ 35,500) ధర చెల్లించాల్సివుంటుంది. అయితే, ఎటువంటి వేరియంట్ ఇండియాలో విడుదలకానున్నదనే విషయం మాత్రం తెలియరాలేదు కాని, 6GB +128GB వేరియంట్ ఇండియాలో విడుదలకావచ్చని, కొన్ని వేదికలు చెబుతున్నాయి.

హానర్ వ్యూ 20 ప్రత్యేకతలు

ఈ హానర్ వ్యూ 20,  2310×1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో  ఒక పెద్ద 6.4 అంగుళాల Full HD + ఆల్-వ్యూ డిస్ప్లేని కలిగి ఉంది. ఆల్-వ్యూ డిస్ప్లే అనేది ఒక ప్యానెల్ రంధ్రంతో కూడిన డిస్ప్లేతో ఉంటుంది డిస్ప్లేలో కేవలం ఒక పానల్ రంధ్రం మాత్రమే ఉంటుంది, ఇది ఒక సెలి షూటర్ను కలిగివుంటుంది. ఎగువ ఎడమ మూలలో గుండ్రంగా 4.5mm వ్యాసంలో ఇది ఉంటుందని అని హువావే చెప్పింది.   గ్లాస్ క్రింద,  V- ఆకార నమూనాతో ఒక గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్  బ్లూ, బ్లాక్ మరియు రెడ్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా – కోర్ కిరిన్ 980 ప్రధాన చిప్సెట్ తో శక్తినిస్తుంది, ఇది 7nm ప్రాసెసుతో తయారు చేయబడుతుంది. అదే ప్రాసెసర్ Huawei యొక్క తాజా ఫ్లాగ్షిప్ అయినటువంటి, హువావే మేట్ 20 ప్రో లో చేర్చారు. ఈ పరికరం GPU టర్బో 2.0 తో వస్తుంది, ఇది గేమింగ్ సెషన్ల సమయంలో పనితీరు మరియు గ్రాఫిక్స్లను  మెరుగుపరిచే సాంకేతికత అని సంస్థ చెబుతోంది. CPU ఉష్ణోగ్రత పరిశీలనలో ఉంచడానికి ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ వ్యవస్థ కూడా ఉంది.

కెమెరా విభాగంలో, హానర్ వ్యూ 20 వెనుక 48MP సోనీ IMX586 CMOS సెన్సార్ను కలిగి ఉంది. 1.6 మైక్రో పిక్సెల్ను అందించడానికి సెన్సార్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. డ్యూయల్ వెనుక కెమెరా యొక్క రెండవ సెన్సార్ డెప్త్ లను పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. డిస్ప్లేలోవున్న పంచ్ రంధ్రం f / 2.0 ఎపర్చరుతో 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఒక 4,000 mAh బ్యాటరీ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఉంది. ఈ ఫోన్ Android 9.0 Pie  పైన ఆధారితమైన మేజిక్ UI 2.0 తో నడుస్తుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :