Nothing Upcoming smartphone launch date announced
Nothing Upcoming స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసింది. భారత మార్కెట్లో బడ్జెట్ ధరలో కూడా స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న నథింగ్, మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రస్తావన తీసుకు వచ్చింది. నథింగ్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు డేట్ తో సహా ప్రకటించింది. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ పేరు మరియు ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
నథింగ్ త్వరలో విడుదల చేయనున్న అప్ కమింగ్ ఫోన్ లాంచ్ గురించి అధికారిక X అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ను మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుందని అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను ‘Power in Perspective’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ గురించి Flipkart కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
ముందు నుంచి వస్తున్నా రూమర్లు మరియు కథనాల ప్రకారం, రానున్న ఫోన్ Nothing 3 అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే నథింగ్ 2 సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ లను సైతం విడుదల చేసిన నథింగ్ ఇప్పుడు కొత్త జనరేషన్ సిరీస్ ను విడుదల చేస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Split AC Offers: బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!
నథింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో విడుదల చేసిన టీజర్ ఇమేజ్ ను పరిశీలిస్తే, ఇది కొత్త జెనరేషన్ ఫోన్ అవుతుందని అనిపిస్తోంది. ఇది అందరూ ఊహిస్తున్న నథింగ్ ఫోన్ 3 కావచ్చు. ఈ ఇమేజ్ లో కొత్త నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొత్త కెమెరా సెటప్ తో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఇందులో సిరీస్ పేరుకు తగ్గట్టుగా ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుందని ఊహిస్తున్నారు. అయితే, ఇవన్నీ కూడా రూమర్లు మరియు అంచనా ఫీచర్స్ అని మాత్రమే సుమా.
ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Snapdragon చిప్ సెట్, దానికి తగిన వేగవంతమైన ర్యామ్ వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ ఫోన్ లేటెస్ట్ Nothing OS 3.1 ఆధారితమైన Android 15 OS తో లాంచ్ కావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ ట్లో ఎంత నిజం ఉంటుందో చూడాలి.