Nothing Phone (3a) Series price leak ahead of india launch
Nothing Phone (3a) Series లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న కంపెనీ ఎట్టకేలకు ఈ ఫోన్ ఫుల్ లుక్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు కేవలం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే బయట పెట్టిన నథింగ్, ఈ ఫోన్ ఇమేజ్ ను మాత్రం బయపెట్ట లేదు. అయితే, ఈ రోజు నథింగ్ అప్ కమింగ్ ఎలా ఉంటుందో తెలిపే టీజర్ ఇమేజ్ ను రిలీజ్ చేసింది.
నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ (3a) సిరీస్ ను మార్చి 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ కోసం టైం లైన్ సెట్ చేసిన కంపెనీ డైలీ సరికొత్త టీజర్ తో ఈ ఫోన్ పై గొప్ప హైప్ తెచ్చింది. ఈరోజు ఈ ఫోన్ పై పరదా తొలగించి ఫోన్ ఎలా ఉంటుందో బయట పెట్టింది.
ఈ ఫోన్ సరికొత్త స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ముందుగా వచ్చిన నథింగ్ ఫోన్స్ అప్గ్రేడ్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, 3a సిరీస్ ఫోన్ లలో వెనుక సరికొత్త కెమెరా సెటప్ మరియు లైట్ సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇప్పటి వరకు నథింగ్ డ్యూయల్ రియర్ కలిగిన ఫోన్ లను మాత్రమే అందించింది. ఈ సెటప్ కొత్త అప్గ్రేడ్ అవుతుంది.
అంతేకాదు, ఈ కెమెరా సెటప్ లో పెరిస్కోప్ కెమెరాని జత చేసింది. ఈ ఫోన్ పెరిస్కోప్ కలిగిన మొదటి నథింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక రౌండ్ కెమెరా బంప్ ను మరియు ఆకట్టుకునే హాఫ్ రౌండ్ లైట్ సెటప్ తో అందించింది. ఈ పూర్తి సెటప్ ఫోన్ ను ఆకర్షనీయంగా మార్చింది.
Also Read: 6 వేలకే 200W 5.1 ఛానల్ బ్రాండెడ్ Soundbar అందుకునే గొప్ప ఛాన్స్.!
ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రే రెండు కలర్ లలో వచ్చే అవకాశం ఉండవచ్చు. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లులు కూడా కంపెనీ త్వరలో అందించవచ్చు. ప్రస్తుతానికైతే ఫోన్ లుక్స్ అదరగొడుతోంది.అంరై మరి ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ ఎలా ఉంటాయో చూడాలి.