Nothing Phone (3a) Lite: టాప్ ఫీచర్లు మరియు ఆఫర్లు తెలుసుకోండి.!

Updated on 30-Nov-2025
HIGHLIGHTS

నథింగ్ ఫోన్ 3a సిరీస్ నుంచి Lite స్మార్ట్ ఫోన్ ను కొత్తగా విడుదల చేసింది

ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్స్ మరియు బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ మూడు రంగుల్లో లభిస్తుంది

Nothing Phone (3a) Lite: నథింగ్ ఫోన్ 3a సిరీస్ నుంచి Lite స్మార్ట్ ఫోన్ ను కొత్తగా విడుదల చేసింది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్స్ మరియు బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ మరియు ఆఫర్స్ పై ఒక లుక్కేయండి.

Nothing Phone (3a) Lite: ప్రైస్

నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్ ఫోన్ (8 జీబీ + 128 జీబీ) బేసిక్ వేరియంట్ రూ. 20,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ రెండో (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 22,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. వన్ కార్డ్ క్రెడిట్ కార్డు మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. ఈ ఆఫర్ తో నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల బేసిక్ ధరలో అందుతుంది. డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది.

Nothing Phone (3a) Lite : టాప్ ఫీచర్స్

డిస్ప్లే

ఈ నథింగ్ కొత్త ఫోన్ 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పిక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఈ నథింగ్ బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ ర్యామ్ బూస్ట్ సపోర్ట్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ జతగా ఉంటాయి.

ఆపరేటింగ్ సిస్టం

ఈ ఫోన్ నథింగ్ OS 3.5 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 15 OS తో వస్తుంది. అయితే, దీర్ఘ మనుగడ కోసం ఈ ఫోన్ 3 సంవత్సరాల మేజర్ అప్డేట్ మరియు 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

కెమెరా

ఫోన్ 3a లైట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ రియర్ కెమెరాలో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 4 cm మ్యాక్రో సెన్సార్ లు ఉంటాయి. ఈ ఫోన్ 30FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ యాంటీ షేక్ కెమెరా EIS సపోర్ట్ తో వస్తుంది.

Also Read: Jio Hot star సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే జియో టాప్ 3 ప్లాన్స్.!

బ్యాటరీ

ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :