Nothing OS 4.0: నథింగ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. Android 16 టీజర్ వచ్చేసింది.!

Updated on 18-Sep-2025
HIGHLIGHTS

నథింగ్ అప్ కమింగ్ OS అప్ డేట్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది

గూగుల్ యొక్క లేటెస్ట్ వెర్షన్ Android 16 OS కోసం అందించే కొత్త సాఫ్ట్ వేర్ అప్‌డేట్

ఈ కోత్త సాఫ్ట్ వేర్ తో ఏమిటి ఎక్స్పెక్ట్ చేయెచ్చు కూడా తెలిపింది

Nothing OS 4.0: UK బేస్డ్ మొబైల్ తయారీ కంపెనీ నథింగ్ అప్ కమింగ్ అప్ డేట్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. గూగుల్ యొక్క లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం వెర్షన్ Android 16 OS కోసం అందించే కొత్త సాఫ్ట్ వేర్ అప్‌డేట్ నథింగ్ OS 4.0 అప్‌డేట్ తెలిపే కొత్త టీజర్ వీడియో విడుదల చేసింది. ఇందులో, ఈ అప్ కమింగ్ అప్డేట్ మరియు ఈ కోత్త సాఫ్ట్ వేర్ తో ఏమిటి ఎక్స్పెక్ట్ చేయెచ్చు కూడా తెలిపింది.

ఏమిటి Nothing OS 4.0?

నథింగ్ త్వరలో అందించనున్న అప్ కమింగ్ అప్డేట్ మరియు ఇది ఆండ్రాయిడ్ 16 OS తో ఆధారితంగా ఉంటుంది. ఈ అప్ డేట్ ఎప్పటి వరకు అందిస్తుందో డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అప్ కమింగ్ పేరుతో ఈ మేజర్ అప్డేట్ గురించి టీజింగ్ చేస్తోంది. ఇది ప్రస్తుతం ముందుగా బీటా యూజర్లకు అందిస్తుంది మరియు తర్వాత యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Nothing OS 4.0 కొత్త ఫీచర్స్ ఏమిటి?

ఇది డిజైన్ మరియు UI కోసం కొత్త మెరుగులు దిద్దుకుంది. ఇది కొత్త లాక్ స్క్రీన్ క్లాక్ స్టైల్ మరియు క్లీనర్ క్విక్ సెట్టింగ్స్ కలిగి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం కొత్త పాప్ అప్ వ్యూ ఆప్షన్ అందిస్తుంది. అంటే, రెండు యాప్స్ ను చిన్న విండోలో ఓపెన్ చేసి వాడుకునే అవకాశం అందిస్తుంది. కొత్త అప్డేట్ తో AI మీద మంచి నిఘా ఉంచుతుంది. ఎందుకంటే, AI Transparency ఫీచర్ ఇప్పుడు అందిస్తుంది. దీనితో ఫోన్ లో AI ఎప్పుడు వాడుతుందో చూపించే డాష్‌బోర్డ్ అందిస్తుంది మరియు యూజర్‌కు AI కంట్రోల్ ఆప్షన్లు కూడా ఆఫర్ చేస్తుంది.

కెమెరా మరియు గ్యాలరీ లో కూడా మంచి మెరుగులు అందించింది. ఇది TrueLens Engine, కెమెరా కోసం మెరుగైన కంట్రోల్స్ మరియు కొత్త ఫిల్టర్లు అందిస్తుంది. ఈ ఫోన్ లో మరింత గొప్ప డార్క్ మోడ్ ను కూడా జత చేసింది. ఇది కళ్ళకు హాని తగ్గించడమే కాకుండా బ్యాటరిని కూడా సేవ్ చేస్తుంది. ఇక సిస్టమ్ మెరుగులు విషయానికి వస్తే, ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో మెరుగులు అందుకుంది మరియు లాక్ స్క్రీన్ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇది కాకుండా మరింత స్టేబుల్ బ్లూటూత్ అండ్ Wi-Fi కనెక్టివిటీ మరియు క్విక్ యాప్ ఓపెన్ వంటి మెరుగుదల అందుకుంది.

Also Read: Samsung Festive Sale: గెలాక్సీ ఫోన్స్ పై పండుగ తగ్గింపు ఆఫర్ ప్రకటించిన శామ్సంగ్.!

ఈ కొత్త అప్డేట్ అందుకునే ఫోన్స్ ఏమిటి?

  • నథింగ్ ఫోన్ (2)
  • నథింగ్ ఫోన్ (2a)
  • నథింగ్ ఫోన్ (2a Plus)
  • నథింగ్ ఫోన్ (3)
  • నథింగ్ ఫోన్(3a)
  • నథింగ్ ఫోన్(3a Pro)
  • CMF Phone (1)
  • CMF Phone (2 Pro)

సింపుల్ గా చెప్పాలంటే, ఒక్క నథింగ్ ఫోన్ (1) తప్ప మిగిలిన అన్ని ఫోన్లకు ఈ కొత్త అప్డేట్ లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :