నేచర్ ఫ్రెండ్లి 5G ఫోన్ లాంచ్ చేసిన నోకియా.!

HIGHLIGHTS

నోకియా నుండి మరొక స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది

Nokia X30 5G గొప్ప ఎకో-ఫ్రెండ్లీ ఫోన్

Nokia X30 5G ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా మంచి కెమేరా సిస్టం తో ఆకట్టుకుంటుంది

నోకియా నుండి మరొక స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. అదే Nokia X30 5G స్మార్ట్ ఫోన్ మరియు ఇది గొప్ప ఎకో-ఫ్రెండ్లీ ఫోన్ అని కూడా నోకియా చెబుతోంది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా మంచి కెమేరా సిస్టం తో ఆకట్టుకుంటుంది. నోకియా కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఆఫర్ల వివరాల పైన ఒక లుక్కేద్దామా. 

Nokia X30 5G: ధర

Nokia X30 5G ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.48,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐస్ వైట్ బ్లాక్ క్లౌడ్ బ్లూ రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ నోకియా స్టోర్ మరియు అమెజాన్ నుండి సేల్ అవుతుంది మరియు ప్రస్తుతం Pre-Orders కి అందుబాటులో వుంది. ఈ ఫోన్ తో పాటుగా నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్ మరియు 33W ఫాస్ట్ చార్జర్ ను ఉచితంగా కంపెనీ అఫర్ చేస్తోంది.  

Nokia X30 5G: స్పెక్స్

Nokia X30 5G స్మార్ట్‌ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ పెద్ద 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ని కంపెనీ అందించింది. ఈ ఫోన్ లో 4,200 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది.

నోకియా ఎక్స్ 30 5G లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా మరియు  13MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ OS అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :