Nokia XR20: అత్యంత దృఢమైన 5G ఫోన్ లాంచ్..ఫీచర్లు చూస్తే కళ్ళు తిరగాల్సిందే..!

Updated on 19-Oct-2021
HIGHLIGHTS

Nokia XR20 అత్యంత కఠినమైన నిర్మాణాన్ని కలిగివుంది

HMD Global తన నోకియా సంస్థ ద్వారా అత్యంత దృఢమైన 5G ఫోన్ Nokia XR20 ను ఇండియాలో విడుదల చేసింది. రేపటి నుండి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రీ సేల్స్ రేపటి నుండి మొదలువుతుండగా, అక్టోబర్ 30 నుండి పూర్తిస్థాయి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఇటీవల కేవలం రెండు బడ్జెట్ ఫోన్ లను మాత్రమే లాంచ్ చేసిన నోకియా ఈసారి మాత్రం అత్యంత దృఢమైన స్మార్ట్ ఫోన్ ను అందించింది.

Nokia XR20: ప్రత్యేకతలు

Nokia XR20 స్మార్ట్ ఫోన్ అత్యంత కఠినమైన నిర్మాణాన్ని కలిగివుంది మరియు ఇది ఆల్-రౌండ్ ప్రొటక్షన్ ఇస్తుంది. ఇది IP68 రేటింగ్ సర్టిఫికేషన్ మరియు మిలిటరీ గ్రేడ్ రెసిలియన్స్ తో వస్తుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తునుండి నుండి పడినా కూడా కానంత గట్టిగా డ్రాప్-రెసిస్టెంట్ మరియు MIL-STD-810H కి కూడా అనుకూలంగా ఉంటుంది.

ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ 6. 67 ఇంచ్ FHD+ (2400×1080) రిజల్యూషన్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ కటౌట్ నోచ్ డిజన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ మరింత గట్టిగా సురక్షితంగా ఉంచడానికి వీలుగా Gorilla Glass Victus తో అందించింది. ఈ నోకియా ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 5G ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ భారీ కెమెరా సెటప్ నే కలిగివుంది. ఈ ఫోన్ వెనుక f/1.8 ఎపర్చర్‌ కలిగిన 48MP మైన్ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలు కూడా Zeiss ఆప్టిక్స్ వస్తాయి మరియు 30FPS వద్ద 1080p లో రికార్డ్ చేయగలవు. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా వుంది. నోకియా XR20 స్మార్ట్ ఫోన్ ను 4,630mAh బ్యాటరీని 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 15W  వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ అందించింది.    

Nokia XR20: ధర

Nokia XR20 స్మార్ట్ ఫోన్ కేవలం 6GB/128GB సింగిల్ వేరియంట్ లో మాత్రమే వచ్చింది మరియు దీని ధర రూ.46,999. ఈ ఫోన్ అల్ట్రా బ్లూ మరియు గ్రానైట్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది. Nokia XR20 అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్, e-కామ్ ప్లాట్ఫారమ్స్ మరియు నోకియా అధికారిక వెబ్సైట్ nokia.com నుండి లభిస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :