విడుదలకు ముందే లీకైన Nokia X10 మరియు Nokia X10 స్పెక్స్

HIGHLIGHTS

ఏప్రిల్ 8 న నోకియా స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటన

Nokia X10 మరియు Nokia X10 స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ 8 న ప్రకటించని రూమర్

HMD గ్లోబల్, ఏప్రిల్ 8 న తన నోకియా స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటన చేసింది. చాలా కాలంగా ఊరిస్తున్న నోకియా 10 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఈ తేదికి లాంచ్ చెయ్యవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ, Nokia X10 మరియు Nokia X10 స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ 8 న ప్రకటించని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి.

అయితే, నోకియా పవర్ యూజర్ యొక్క ఒక రిపోర్ట్ ప్రకారం Nokia X10 మరియు Nokia X10 లను బడ్జెట్ స్మార్ట్ ఫోన్లుగా స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ మరియు 5G నెట్ వర్క్ తో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అలాగే, నోకియా G10 స్మార్ట్ ఫోన్ ను తన మొట్టమొదటి గేమింగ్ ఫోనుగా కూడా తీసుకొచ్చే ఆలోచనలను చేస్తున్నట్లు కూడా ఈ నివేదిక చెబుతోంది.

ఇక నోకియా X10 మరియు నోకియా X20 యొక్క లీకైన స్పెషిఫికెన్ల విషయానికి వస్తే, ముందుగా చెప్పినట్లు నోకియా నోకియా X10 మరియు నోకియా X20 రెండు ఫోన్లు కూడా క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 480 ఆక్టా కోర్ ప్రాసెసర్ రావచ్చని నోకియా పవర్ యూజర్ నివేదిక సూచించింది. ఈ ఫోన్లు సరసమైన ధరలో 5G నెట్ వర్క్ సపోర్ట్ తో ఉండవచ్చని కూడా తెలిపింది. అయితే, ఇవన్నీ కూడా అంచనా వేసి చెప్పినవే కాబట్టి ఏప్రిల్ 8 న లాంచ్ ఈవెంట్ జరిగే వరకూ వేచి చూడాల్సి వుంటుంది.                                               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :