నోకియా ఫోన్ల పైన డిస్కౌంట్ కూపన్ అఫర్ ప్రకటించిన నోకియా.!

HIGHLIGHTS

నోకియా స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్

నోకియా స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్ కూపన్ ద్వారా తక్కువ ధరకే మీరు పొందవచ్చు

ఈ అఫర్ నోకియా లేటెస్ట్ గా తీసుకొచ్చిన అనేక స్మార్ట్ ఫోన్ల పైన అందించడం విశేషం

నోకియా స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పుడు నోకియా స్మార్ట్ ఫోన్ల పైన నోకియా వెబ్సైట్ నుండి ప్రకటించింది. అంటే, నోకియా స్టోర్ నుండి మీరు నోకియా స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్ కూపన్ ద్వారా తక్కువ ధరకే మీరు పొందవచ్చు. ఈ అఫర్ నోకియా లేటెస్ట్ గా తీసుకొచ్చిన అనేక స్మార్ట్ ఫోన్ల పైన అందించడం విశేషం. ఇందులో, లేటెస్ట్ గా విడుదలైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్ మొదలుకొని చాలా  ఫోన్లు ఉన్నాయి. వీటిలో బెస్ట్ అఫర్ గురుంచి ఈరోజు మనం చూడనున్నాము.                    

నోకియా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ పైన అందించిన అఫర్ గురించే మనం ఈరోజు చుడనున్నది. 50MP కెమెరాతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ మరియు కూపన్ అఫర్ తో లభిస్తోంది. 

Nokia G11 Plus: Price

నోకియా జి11 కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వస్తుంది మరియు దీనిని రూ.12,499 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ నోకియా వెబ్సైట్ నుండి 10,499 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది మరియు ఈ ఫోన్ పైన నోకియా అందించిన రూ1,000 కూపన్ అఫర్ ద్వారా 9,499 ధరకే ఈ ఫోన్ ను పొందవచ్చు. అయితే, ఈ ఫోన్ flipkart నుండి రూ.9,499 అఫర్ ధరతో మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది.  

Nokia G11 Plus: ఫీచర్లు

నోకియా జి 11 ప్లస్ స్మార్ట్‌ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ మరియు 64 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD అప్షన్ వుంది. Nokia G11 పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది.

నోకియా జి 11 ప్లస్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.  ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :