ఏప్రిల్ చివరలో నోకియా ఫోన్స్ మనముందుకు

HIGHLIGHTS

మే ఫస్ట్ వీక్ లోనోకియా 3 లాంచ్ అవుతుంది. మే 2 వీక్ లో నోకియా 5 లాంచ్ అవుతుంది. మే లాస్ట్ వీక్ లో నోకియా 6 లాంచ్ అవుతుంది

ఏప్రిల్  చివరలో  నోకియా  ఫోన్స్  మనముందుకు 

2017, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఇంట్రడ్యూస్  చేయబడిన  నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ఫోన్‌లు, మార్కెట్లో చాలా హల్చల్   చేశాయి . ఈ ఫోన్‌లు ఇంకా మార్కెట్లో విడుదల కానప్పటికి, రిలీజ్‌కు సంబంధించి హెచ్‌ఎండి గ్లోబల్ చేయబోయే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం  వరల్డ్ మొత్తం వెయిటింగ్ చేస్తుంది.జూన్ 2017 నాటికి , ఈ ఫోన్‌లను  ఒక్కసారిగా  120 మార్కెట్లలో రిలీస్  చేసేవిధముగా  హెచ్‌ఎండి గ్లోబల్  తయారీలో ఉన్నట్లు సమాచారం.ఓ చైనా వెబ్‌సైట్ ద్వారా  వచ్చిన లీక్స్ ప్రకారం  చూస్తే  మొదటగా  నోకియా 3310   ను HMD  గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఏప్రిల్ చివరినాటికి ఈ ఫోన్ లు మార్కెట్లో వచ్చేస్తాయి . మే ఫస్ట్  వీక్  లోనోకియా 3 లాంచ్ అవుతుంది. మే 2 వీక్ లో  నోకియా 5 లాంచ్ అవుతుంది. మే లాస్ట్  వీక్ లో  నోకియా 6 లాంచ్ అవుతుంది. ఈ వివరాలను నోకియా అధికారికంగా అనౌన్స్ చేయాలిసి వుంది. అయితే ఎన్నో అంచనాల  మధ్య  మార్కెట్ లోకి వస్తున్న ఈ  నోకియా ఫోన్‌లను  ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా సేల్  చేయనున్నారని తెలుస్తోంది. మరియు  దేశం మొత్తం  సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ తయారీలలో  వుంది 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :