ఫస్ట్ హైబ్రిడ్ ఫోన్ HMD Touch 4G ని లాంచ్ చేసిన నోకియా యాజమాన్య కంపెనీ.!

Updated on 07-Oct-2025
HIGHLIGHTS

HMD ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ఫస్ట్ హైబ్రిడ్ ఫోన్ HMD Touch 4G ని లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను 4G LTE సపోర్ట్ తో పాటు స్మూత్ గా నడిచే టచ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ఆన్లైన్ ఉపయోగాల కోసం తగిన విధంగా ఉంటుంది

నోకియా యాజమాన్య కంపెనీ HMD ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ఫస్ట్ హైబ్రిడ్ ఫోన్ HMD Touch 4G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 4G LTE సపోర్ట్ తో పాటు స్మూత్ గా నడిచే టచ్ స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో చాలా చవక ధరలో విడుదల చేసింది. ఈ కొత్త హైబ్రిడ్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

HMD Touch 4G : ప్రైస్

హెచ్ఎండి తన లేటెస్ట్ హైబ్రిడ్ హెచ్ఎండి టచ్ 4జి ని కేవలం రూ. 3,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ డార్క్ బ్లూ మరియు సియాన్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో ఈ ఫోన్ ని అందించింది. కంపెనీ అధికారిక సైట్ నుంచి ఈ ఫోన్ సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఆన్లైన్ ఉపయోగాల కోసం తగిన విధంగా ఉంటుంది.

HMD Touch 4G : ఫీచర్స్

హెచ్ఎండి టచ్ 4జి ఫోన్ చాలా వినూత్నమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి కీ ప్యాడ్ ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది కానీ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ 10.85mm మందంతో ఉంటుంది కానీ కేవలం 100 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ లో 3.2 ఇంచ్ QVGA స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 2.5D కవర్ గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది ఉంటుంది మరియు చాలా గొప్ప రెస్పాన్స్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ లో వెనుక 2MP సింగల్ రియర్ కెమెరా మరియు ముందు 0.3MP సెల్ఫీ కెమెరా అందించింది. ఇది ఫోటోలు, వీడియో మరియు వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మంచి లైటింగ్ అందించే ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ హెచ్ఎండి హైబ్రిడ్ ఫోన్ 1950 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు టైప్ C ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో WiFi హాట్ స్పాట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, GPS మరియు Beidou సపోర్ట్ కూడా ఉంటుంది.

Also Read: 2025 దీపావళి పండుగ కోసం Flipkart Big Bang Diwali Sale అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

ఈ హెచ్ఎండి కొత్త ఫోన్ Unisoc T127 ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 64 MB ర్యామ్ జతగా 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. MicroSD కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వైర్డ్ మరియు వైర్లెస్ FM సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP52 రేటింగ్ తో వస్తుంది మరియు వాల్యూమ్ మరియు పవర్ కీ కలిగి ఉంటుంది. ఇది 2G/3G/4G LTE CAT4 నెట్వర్క్ తో పని చేస్తుంది మరియు డ్యూయల్ SIM సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాటింగ్ కోసం Express Chat App తో వస్తుంది. ఇది ఈ అప్ ద్వారా చాటింగ్ మరియు వీడియో కాలింగ్ కి అవకాశం అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :