భారీ ఫీచర్లతో 5G ఫోన్ ను విడుదల చేయబోతున్న నోకియా.!

HIGHLIGHTS

ఇండియాలో నోకియా కొత్త 5G ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలుపెట్టింది

పూర్తి వివరాలను నోకియా అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది

ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది

ఇండియాలో నోకియా కొత్త లాంచ్ గురించి టీజింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలను నోకియా అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. మనం మాట్లాడుకుంటోంది Nokia G60 5G స్మార్ట్ ఫోన్ గురించి. ఈ ఫోన్ ను 50MP AI ట్రిపుల్ కెమెరా, FHD+ రిజల్యూషన్ 120Hz  డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి భారీ ఫీచర్లతో తీసుకువస్తునట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది.  మరింకెందుకు ఆలశ్యం ఈ ఆప్ కమింగ్ నోకియా 5G స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.               

Nokia G60 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు

నోకియా జి 60 5జి స్మార్ట్‌ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. Nokia G60 5G పెద్ద 6.58 -అంగుళాల FHD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 12Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ 5 ని కంపెనీ అందించింది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

నోకియా జి 60 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :