Nokia G20: ఇండియాలో Pre-Book కోసం నోకియా స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

జూలై 7 నుండి Nokia G20 ఫోన్ Pre-Booking

అమెజాన్ ఇండియా మైక్రో సైట్ లో టీజింగ్

ఇండియాలో Nokia G20 స్మార్ట్ ఫోన్ ధర రూ.12,000

HMD గ్లోబల్ Nokia G20 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చెయ్యనుంది. అమెజాన్ ఇండియా మైక్రో సైట్ లో ఈ ఫోన్ యొక్క టీజింగ్ ను అందించింది. అయితే, అమెజాన్ మైక్రో సైట్ పేజ్ లో ఈ ఫోన్ జూలై 7 నుండి Pre-Booking కి అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మాత్రమే ప్రకటించింది. కానీ, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రమే వెల్లడించ లేదు.

Nokia G20 స్మార్ట్ ఫోన్ ధరను ఇండియాలో రూ.12,000 గా నిర్ణయించింది మరియు జూలై 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో వుంటుంది. ఈ Nokia G20 స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు  కంపెనీ యొక్క అధికారిక నోకియా స్టోర్లలో మాత్రమే లభిస్తుంది.

Nokia G20: ఫీచర్లు

నోకియా జి 20 స్మార్ట్‌ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్‌ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో,  కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :