Nokia G20 ఇప్పుడు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది

HIGHLIGHTS

Nokia G20 ఇప్పుడు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది

11,700 రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా అఫర్ చేస్తోంది

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది

ఇటీవల నోకియా విడుదల చేసిన Nokia G20 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. నోకియా జి20 స్మార్ట్ ఫోన్ అమెజాన్  నుండి 500 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది. Nokia G20 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి ప్రస్తుతం రూ.12,490 రూపాయల తక్కువ ధరకే పొందవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనాలనుకుంటే 11,700 రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా అఫర్ చేస్తోంది. Buy from Here

Nokia G20: ఫీచర్లు

నోకియా జి 20 స్మార్ట్‌ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్‌ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో,  కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :