Nokia G11 Plus పైన రూ.2,000 భారీ తగ్గింపు అందుకోండి.!

నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia G11 Plus ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Nokia G11 Plus ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్, మంచి ఆకర్షణీయమైన డిజైన్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఫోనుగా కొనుగోలుదారుల కితాబు అందుకుంది. ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్లు, స్పెక్స్ మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి.     

Nokia G11 Plus: Price

నోకియా జి11 కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు ఈ ఫోన్ ను నోకియా రూ.12,499 ధరతో'విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.10,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ చార్కోల్ గ్రే మరియు లేక్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది. 

Nokia G11 Plus: ఫీచర్లు

నోకియా జి 11 స్మార్ట్‌ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ మరియు 64 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD అప్షన్ వుంది. Nokia G11 పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది.

నోకియా జి 11 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.  ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :