నమ్మశక్యం కానీ ధరతో Nokia C10 లాంచ్

Updated on 09-Apr-2021
HIGHLIGHTS

నోకియా ఆరు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది

నమ్మశక్యం కానీ ధరతో Nokia C10 లాంచ్ చేసింది.

నమ్మశక్యం కానీ ధరతో Nokia C10 లాంచ్ చేసింది.

నోకియా నిన్న ఆరు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది. వీటిలో, నమ్మశక్యం కానీ ధరతో Nokia C10 లాంచ్ చేసింది. ఈ ఫోన్, పెద్ద డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ తో పాటుగా C20 కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కూడా తక్కువ ధరలో C10 మాదిరిగా ఫీచర్లను కలిగి ఉంటుంది. మరి తక్కువ ధరలో వచ్చిన C20 ఫీచర్లు మరియు ధర వివరాలేమిటో చూసేద్దాం..!                        

నోకియా C10 ఫీచర్లు

నోకియా C10 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ V నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 2D పాండా గ్లాస్ రక్షణతో మరియు 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ డిస్ప్లే 720X1600 రిజల్యూషన్ తో వుంటుంది. ఈ ఫోన్ Unisoc క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 1GB మరియు 2GB ర్యామ్ కి జతగా 16GB మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్లో ఉన్న కెమెరాల పరంగా ఈ ఫోన్ ముందు మరియు వెనుక సింగిల్ కెమెరాతో ఉంటుంది. రియర్ మరియు సెల్ఫీ కెమెరాగా f/2.2 ఎపర్చరుతో 5MP కెమెరాలను అందించింది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కూడా ఫ్లాష్ ని అందించింది. ఇక OS విషయానికి వస్తే, నోకియా C20 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 (Go Edition) తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 3,000 బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేస్తుంది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :