నోకియా 6.2 ను గత నెలలో IFA 2019 సందర్భంగా ప్రవేశపెట్టారు. అదే కార్యక్రమంలో, HMD గ్లోబల్ సంస్థ నోకియా 6.2 తో పాటుగా అనేక నోకియా ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుతం కంపెనీ ఈ నోకియా 6.2 ను భారతదేశంలో కూడా విడుదల చేయబోతోంది. అమెజాన్ ఇండియాలో అందించిన ఒక టీజర్ ద్వారా ఈ ఫోన్ గురించిన వివరాలు, ఫోన్ యొక్క ప్రత్యేకతలు మరియు లాంచ్ డేట్ కూడా వెల్లడయ్యాయి.
ఇక ధర గురించి చూస్తే , ఈ నోకియా 6.2 ధర యూరోపియన్ మార్కెట్లో 199 యూరోల నుండి మొదలవుతుంది, ఇది మన కరెన్సీలో చూస్తే సుమారు 15,800 రూపాయలుగా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క సెల్ కూడా అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతుంది. యూజర్లు ఈ ఫోన్‌ను సిరామిక్ బ్లాక్ అండ్ ఐస్ కలర్లో కొనుగోలు చెయవచ్చు.
డ్యూయల్ సిమ్‌తో కూడిన ఈ నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ పై OS తో నడుస్తుంది మరియు HDR 10 మద్దతు ఇవ్వగల ఒక 6.3-అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌తో 4 జీబీ వరకు ర్యామ్‌ను అందించారు. దీనితో పాటు, ఈ ఫోన్ 3,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుంది.
ఈ నోకియా 6.2 లో, 16 మెగాపిక్సెల్స్ + 5 మెగాపిక్సెల్స్ + 8 మెగాపిక్సెల్ సెన్సార్లతో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఈ నోకియా 6.2 యొక్క ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జిబి వరకు ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, యుఎస్బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ మరియు 4G LTE వంటివి ఉన్నాయి.