HMD Global, గతంలో Nokia యొక్క అత్యంత ప్రాచుర్యమైన Nokia 5310 Express Music 2020 ఫోన్నుఇటీవల భారతదేశంలో ప్రకటించింది. ఈ ఫోన్, అదే పాత 5310 ప్రసిద్ధ ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క ఐకానిక్ రెట్రో డిజైన్ తో తిరిగి వస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ గతంలో సంగీత ప్రియులను అత్యధికంగా ఆకటున్న ఫోనుగా అందరికి గుర్తుండిపోయుంది. ఇప్పుడు, ఫోన్ను కొత్త డిజైన్ మరియు ఫీచర్లతో అదే పాత పేరుతో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్, జూన్ 23 నుండి అనగా ఈరోజు నుండి నోకియా ఇండియా స్టోర్ మరియు అమెజాన్ ఇండియా నుండి మొదలయ్యింది కాబట్టి మీరు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ నోకియా 5310, రాబోయే వారాల్లో ఆఫ్‌లైన్ మార్కెట్లలో కూడా లభించనుంది.
నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2020 Price విషయానికి వస్తే, దీన్ని కేవలం 3,399 రూపాయల ధరలో మరియు రెండు రంగులలో అందించింది – తెలుపు మరియు నలుపు.
ఈ కొత్త నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2020 ఫీచర్ ఫోన్‌లో 13.1 మిమీ మందంతో నిర్మించిన ప్లాస్టిక్ బాడీ ఉంది, దీని బరువు 88 గ్రాములు. ముందుగా వచ్చిన 5310 కంటే, ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ సన్నగా మరియు తేలికైనది. 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క హైలైట్ ఏమిటంటే ఇది మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ మరియు వాల్యూమ్ కోసం ప్రత్యేకమైన బటన్లతో వస్తుంది.
ఇది 320 x 240 పిక్సెల్స్ కలిగిన QVGA రిజల్యూషన్ మరియు 4: 3 యాస్పెక్ట్ రేషియోతో ఒక 2.4-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త నోకియా 5310 మీడియాటెక్ MT6260A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు నోకియా యొక్క సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32 జిబి వరకు స్టోరేజిను పెంచే ఎంపికతో 8 MB ర్యామ్ మరియు 16 MB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది.
ఈ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో సపోర్ట్ చేసిన VGA కెమెరా అమర్చారు. ఇయర్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి ఇది 3.5 ఎంఎం జాక్‌ను కలిగి ఉంది మరియు బ్లూటూత్ 3.0 కి మద్దతుతో వస్తుంది. నోకియా 5310 ఫీచర్ ఫోన్ ఒక 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడివుంది. ఇది 20 గంటల టాక్ టైం వరకు అందించగలదని మరియు స్టాండ్ బై మోడ్లో 22 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.