Nokia లేటెస్ట్ Flip ఫోన్ రెండు కొత్త కలర్ లతో తిరిగొచ్చింది.!

HIGHLIGHTS

Nokia 2660 Flip 4G ఇప్పుడు మరొక రెండు కొత్త కలర్ లలో తిరిగొచ్చింది

ఈ ఫోన్ ముందుగా కేవలం మూడు కలర్ అప్షన్ లలో మాత్రమే లభించేది

ఇప్పుడు మొత్తం ఐదు కలర్ లలో ఈ ఫోన్ లభిస్తోంది

Nokia లేటెస్ట్ Flip ఫోన్ రెండు కొత్త కలర్ లతో తిరిగొచ్చింది.!

నోకియా ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన Nokia 2660 Flip 4G ఇప్పుడు మరొక రెండు కొత్త కలర్ లలో తిరిగొచ్చింది. ఈ ఫోన్ కొత్త కలర్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో మాత్రం ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఫోన్ ముందుగా కేవలం మూడు కలర్ అప్షన్ లలో మాత్రమే లభించేది. అయితే, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన రెండు కలర్ అప్షన్ లతో కలిపి మొత్తం ఐదు కలర్ లలో ఈ ఫోన్ లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia 2660 Flip 4G: కొత్త కలర్స్ మరియు ధర 

నోకియా 2660 ఫ్లిప్ 4G ఫోన్ ముందుగా రూ. 4,699 ధరలో బ్లాక్, బ్లూ మరియు రెడ్ మూడు కలర్ అప్షన్ లతో వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ లష్ గ్రీన్ మరియు పాప్ పింక్ అనే రెండు కొత్త కలర్ అప్షన్ లలో కూడా లభిస్తుంది. అయితే, ధర వివరాలు మాత్రం తెలియ రాలేదు. 

Nokia 2660 Flip 4G: స్పెక్స్ 

ఇక ఈ Nokia 2660 Flip 4G ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 2.8 ఇంచ్ ప్రధాన డిస్ప్లే ని మరియు 1.77 ఇంచ్ సెకండరీ డిస్పీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మడత పెట్టె ఫోన్ కాబట్టే Flip ఫోన్ గా పిలవబడుతుంది. 

ఈ ఫోన్ యునిసోక్ T107 ప్రోసెసర్, 0.3MP VGA కెమేరా, 1450mAh బ్యాటరీ, 48MB ర్యామ్ కి జతగా 128MB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు SD Card ద్వారా 32 GB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ ఫీచర్ లను కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo