iQOO 15R Price: ఐకూ లేటెస్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

చాలా కాలంగా ఐకూ టీజింగ్ చేస్తున్న ఐకూ 15R స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది

ఈ ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా గొప్ప డీల్స్ కూడా ఐకూ అనౌన్స్ చేసింది

iQOO 15R Price: చాలా కాలంగా ఐకూ టీజింగ్ చేస్తున్న ఐకూ 15R స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఈ ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా గొప్ప డీల్స్ కూడా ఐకూ అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ ఐకూ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

iQOO 15R Price:

ఐకూ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరలు ఇక్కడ చూడవచ్చు.

ఐకూ 15R (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 44,999

ఐకూ 15R (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 47,999

ఐకూ 15R (12 జీబీ + 512 జీబీ) ప్రైస్ : రూ. 52,999

ఈ ఫోన్ యొక్క ప్రీ ఆర్డర్ లను ఈరోజు నుండి ప్రారంభించింది. ఈ ఫోన్ Amazon మరియు iQOO e-store నుంచి ఈ ఫోన్ ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

ఆఫర్స్ :

ఈ ఫోన్ పై భారీ డీల్స్ అండ్ ఆఫర్స్ ను ఐకూ అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు ప్రీ బుక్ చేసుకునే వారికి రూ. 1899 రూపాయల విలువైన ఐకూ TWS బడ్స్ ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై 12 నెలల అదనపు వారంటీ ఆఫర్ కూడా అందించింది. ఇక మెయిన్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్ రూ. 4,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Also Read: లేటెస్ట్ Xiaomi బిగ్ 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

iQOO 15R : ఫీచర్స్

ఈ ఐకూ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో విడుదల చేసింది. ఇది 3nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు 35 లక్షల పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB హెవీ స్టోరేజ్ (UFS 4.1) కలిగి ఉంటుంది. ఇవి కాకుండా ఈ ఫోన్ లో Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-700V సెన్సార్ + OIS) జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద సూపర్ స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 7600mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను అతి వేగంగా ఛార్జ్ చేసే 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ Wi-Fi 7, Bluetooth 5.4 వంటి లేటెస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ మంచి సౌండ్ అందించే అడ్వాన్స్డ్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ తో స్టైల్ గా ఉండటమే కాకుండా IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :